కోటి రూపాయలచెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ ధర్మారం మండలంలో లబ్ధిదారులకు ₹ 1, 11, 85, 500/-  (కోటి పదకొండులక్షల ఎనభై ఐదు వేల ఐదువందల రూపాయలు )  విలువగల చెక్కులను శనివారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.


ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి  ₹ 33,88,500/-  చెక్కులను, దాదాపు ₹ 78 లక్షల  విలువ గల 77 కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


👉 ముక్రమ్ పనితీరు అభినందనీయం. ఎమ్మెల్యే!


పంచాయతీ రాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహించిన ముక్రమ్ పనితీరు అభినందనీయమని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి పట్టణ కేంద్రంలోని వాసవి గార్డెన్స్ లో శనివారం జరిగిన పంచాయతీ రాజ్ శాఖలో AE గా ముక్రమ్  పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని  ముక్రమ్ ను ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు,  మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు  పాల్గొన్నారు.