👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కులగణనపై తీసుకున్న నిర్ణయం పై
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంతోషదాయకము అని అన్నారు.
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేశారు.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

రాహుల్ గాంధీ గత ఎన్నికల ప్రణాళికలో కుల గణన చేపడుతామని హామీ ఇవ్వడం తోపాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన చేసిందన్నారు. రాహుల్ గాంధీ డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి కుల గణన చేపడుతామని ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేశారు.

నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలోని నిమ్న వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లతో ఫలాలు పొందుతున్నారనీ, కుల గణన తోనే ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారికి జనాభా వివరాలు వెల్లడవుతాయని ఎమ్మెల్యే అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే నిబంధనలను సవరించి ప్రస్తుతం బలహీన వర్గాలకు అమలు చేస్తున్న 29% రిజర్వేషన్ల స్థానంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలనీ, విద్యా ఉద్యోగ అవకాశాలు కేవలం ప్రభుత్వ కార్యాలయాలోనే కాకుండా ప్రైవేట్ రంగాలలో అమలు చేయాలి అని ప్రైవేట్ పాఠశాలల్లో సైతం రిజర్వేషన్లు అమలయ్యేలా కలెక్టర్లు చొరవ చూపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కోరారు.