J.SURENDER KUMAR,
సోమవారం ఉదయం నుండే పుష్కర స్నానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరానికి చేరుకున్నారు. ఉదయం నుండే వేలాదిగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడానికి తరలివస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు తెల్లవారుజామునే చేరుకున్నారు.

కాళేశ్వరంలోని ప్రతి మూల కోణం భక్తులతో నిండిపోతోంది. ప్రధాన ఘాట్‌లు, స్నానాల ప్రాంతాలు, దేవాలయం పరిసరాలు జనసంద్రమయంగా మారాయి.
ఇది కుంభ మేళాను తలపించేలా ఉంది. భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పుష్కర స్నానాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

జిల్లా కలెక్టర్ రాహూల్ శర్మ ఉదయం నుండి సరస్వతి ఘాట్ లో పారిశుద్ధ్య, స్నానాలు ఘాట్లు పరిశీలంచారు. ఏర్పాట్లు పై అధికారులకు అక్కడికక్కడే వాకి టాకి ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు.

👉 సరస్వతి పుష్కర దృశ్యం మాలికలు !












