లక్షా 20 వేల మంది పుష్కర స్నానాలు !

J.SURENDER KUMAR,


సరస్వతి పుష్కరాల సందర్భంగా శుక్రవారం  ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలకు సరస్వతి  ఘాట్ చేరుకొని దాదాపు 1.20 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు అని అధికార యంత్రం ప్రకటించింది.


భక్తుల రాకతో ఘాట్ల వద్ద ఆధ్యాత్మిక చైతన్యం కనిపించింది.  అధికారులు భక్తులకు మార్గ నిర్దేశనం చేస్తూ, పుష్కర స్నానంతో పాటు భక్తులు నదీ తీరాల్లో హారతులు సమర్పిస్తూ, దానం చేస్తూ తమ ఆధ్యాత్మికతను చాటుకున్నారు.


పుష్కరాల వేడుకలు మరో 10 రోజులు కొనసాగనున్న సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.