లొంగిపోయిన ద్రోహుల సమాచారం తోఎన్కౌంటర్ !

👉మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు హత్య !

👉 మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ  పేరుతో మావోయిస్టులు లేఖ  విడుదల !


J.SURENDER KUMAR,

లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని లేఖలో వాపోయారు. కేశవరావు 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసన్నారు.

కేశవరావు టీమ్ లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవల పోలీసులకు లొంగిపోయారని, వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడొకరు సైతం ద్రోహిగా మారాడని లేఖలో పేర్కొన్నారు.


ఎన్కౌంటర్ ముందురోజు నుంచి 20 వేలమంది బలగాలు తామున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి..
10 గంటల్లో ఐదు ఎన్కౌంటర్లు చేశాయని మావోయిస్టులు లేఖలో తెలిపారు.


60 గంటలపాటు బలగాలు తమను నిర్బంధించాయన్నారు. అప్పటికే కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించగా..తమను వదిలి వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు.

నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని తమతోనే ఉన్న కేశవరావుకోసం 35 మంది ప్రాణాలు అడ్డుపెడితే..
ఏడుగురం సురక్షితంగా బయటపడ్డామని, మిగిలిన వారంతా ఎన్కౌంటర్లో మరణించారని తెలిపారు.

ఇప్పటికే తాము కాల్పుల విరమణ ప్రకటించినట్లు చెప్పారు.
దేశ సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ జరిపిన కేంద్రం.. తమతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హమన్నారు.
ఈ విషయంపై కేంద్రం పునరాలోచించాలని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.