మాదిగలకు న్యాయం జరగాలి  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరాం. మాదిగలకు న్యాయం జరగాలి అన్నింట్లో మాదిగ లే ముందుండి పోరాడుతున్నారు అని ధర్మపురి ఎమ్మెల్యే విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

హైదరాబాద్ అసెంబ్లీలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడారు

👉🏻 ఈడీ ఛార్జ్ షీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉందని బీఆర్ఎస్, బీజేపీ తెగ హడావిడి చేస్తున్నాయి అన్నారు.

👉🏻 పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నారు.

👉🏻 విపక్ష పార్టీ లపైన కేంద్రం ఈడీ ని ప్రయోగిస్తోంది. ప్రశ్నించే వారిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధిస్తోంది వివరించారు.

👉🏻 సీఎం రేవంత్ రెడ్డి కి దేశంలోనే గొప్ప పేరు వస్తుందన్న భయంతో బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి దగ్గరుండి ఓట్లు వేయించారు..బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీ పైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ఆరోపించారు.

👉🏻 తెలంగాణకు నిధులెందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదు..? అనీ ప్రశ్నించారు.

👉🏻 ఈడీని అడ్డం పెట్టుకుని వేధించడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు పేర్కొన్నారు.

👉🏻 బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మడం లేదు.. ఆ పార్టీ లేవడం లేదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే జనం నిలబడతారు ఆని స్పష్టం చేశారు.