J.SURENDER KUMAR,
దేశంలో శాంతిని నెలకొల్పేందుకు, కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని మంత్రి సీతక్క @ ధనసరి అనసూయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ధర్మారం పెగడపల్లి మండల పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు..
మావోయిస్టులతో చర్చలు లేవని మాట్లాడిన కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల ఆమె స్పందించారు..
తాను గతంలో ఉద్యమంలో పని చేసిన బంధం తెగిపోయినప్పటికి, ఆదివాసీ పేగు బంధం తెగిపోలేదని చెప్పారు…
కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ వల్ల అధివాసీలతో పాటు పోలీసులు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు…
హింసను హింస ద్వారా ఎదురుకోలేమని, శాంతి మార్గం ద్వారానే ఏదైనా ఎదుర్కోవచ్చన్నారు…
అక్కడ ఎవరైనా హింసను ప్రేరేపించే వారు ఉన్నట్లయితే వారిని చట్టబద్ధంగా అరెస్ట్ చేసి కోర్టుల ద్వారా శిక్షించాలన్నారు…
కాంగ్రేస్ పార్టీ ఎప్పుడు కూడా మావోయిస్టులను ప్రోత్సహించలేదని, గతంలో ఉన్న దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో శాంతి చర్చలు జరిపమన్నారు…
ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ,పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు…