J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని ఎల్లాపూర్, కీచులాటపల్లె, ఎడుమొటలపల్లె, రామభద్రుని పల్లె గ్రామాల ప్రజలకు గురువారం ఆర్టిసి బస్సు సౌకర్యం కలిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామస్తులు ఆర్టీసీ బస్సు కోసం ప్రజా ప్రతినిధులకు, అధికార యంత్రంగానికి వినతి పత్రాలు ఇస్తూ విసిగిపోయారు.
👉 ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ జోక్యంతో…

ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గ్రామస్తులు అభ్యర్థన మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించి ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా ఆదేశించారు. దీంతో అధికారులు సకాలంలో స్పందించి. ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించారు. దీనికి తోడు గత కొన్ని రోజుల క్రితం
నంచర్ల గ్రామం నుండి దికొండ వరకు బస్సు సౌకర్యం కల్పించారు.

గురువారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ , ఆర్టీసీ అధికారులు, కలసి ఆయా గ్రామాలకు బస్సులో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాలు ప్రజలు పాల్గొన్నారు.