J.SURENDER KUMAR,
ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మంథని JNTU కళాశాలకు మహర్దశ పట్టింది.
👉 ‘టీసీఎస్ ఐయాన్’ (TCS iON) మంథని జెఎన్ టియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను ప్లేస్ మెంట్ సక్సెస్ ప్రోగ్రాం(PSM) కింద ఎంపిక చేసింది. టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(TCS) కు అనుబంధ సంస్థ అయిన టీసీఎస్ అయాన్ ప్రారంభమైన తర్వాత దేశంలోని ఒక కళాశాల విద్యార్ధుల శిక్షణ కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి.
👉 టీసీఎస్ ఐయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామితో మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయమై పలు దఫాలు చర్చించి మంథని కాలేజీని ఎంపిక చేసేందుకు ఒప్పించారు.
👉 మంథని జెఎన్ టియు లోని అన్ని విభాగాల విద్యార్ధులకు టీసీఎస్ అయాన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
👉 కళాశాల నుంచి మొదట వంద మందిని ఎంపిక చేసి వారికి 20 వారాల పాటు స్వల్ప కాలిక కోర్సులు నిర్వహిస్తుంది. ఇందులో సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించి నైపుణ్య శిక్షణలు ఉంటాయి.
👉 ముంబాయి నుంచి వచ్చే ఫ్యాకల్టీ నిపుణులు ప్రత్యక్షంగా, ఆన్ లైన్ మోడ్ లో శిక్షణ అందిస్తారు.
👉 ఈ కోర్సులన్నీ టీసీఎస్ ఐయాన్ పూర్తి ఉచితంగా అందిస్తుంది. సంస్థతో ఎంప్యానెల్ అయిన 3,000 కు పైగా కంపెనీలు శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతిభావంతులను ఉద్యోగ ఖాళీల్లో భర్తీ చేసుకుంటాయి.