J.SURENDER KUMAR
ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు శుక్రవారం మంథని లో ఘనంగా జరిగాయి
👉 మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయిలి ప్రసాద్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ మరియు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు
మంథని డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంథని సత్యం మరియు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంథని రాకేష్ ఆధ్వర్యంలో మాత శిశు ఆసుపత్రిలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు.
బిసి సెల్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఐలి శ్రీనివాస దత్తాత్రేయ ఆలయంలో పూజలు నిర్వహించారు.
పెద్దపెల్లి జిల్లా ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, లైసెట్టి రాజు, టి. రాజు, మంథని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, ఎన్.ఎస్.యు.ఐ డివిజన్ అధ్యక్షులు చెక్కల సందీప్ గౌడ్ , కాంగ్రెస్ శ్రేణులు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.