మంత్రి దామోదర రాజనర్సింహనేడు ధర్మపురికి రానున్నారు !


👉 శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలలో పాల్గొంటారు.


J.SURENDER KUMAR,


వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం రాత్రి ధర్మపురి క్షేత్రానికి రానున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  లక్ష్మణ్ కుమార్ ఆహ్వాన మేరకు మంత్రి పర్యటన ఖరారు అయింది.


  ధర్మపురిలో రాత్రి  బస  చేసి ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయానికి వెళ్లి  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.


అనంతరం జగిత్యాల లో వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన వివరాలు అధికారికంగా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.