మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఎమ్మెల్యేల విన్నపాలు !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు తదితరు అంశాలపై సమీక్ష సమావేశానికి ఆదివారం జిల్లాకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కి ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ ఎమ్మెల్యేలు  వైద్య సమస్యలు నిధుల మంజూరు తదితరు అంశాలపై వినతి పత్రాలు ఇచ్చారు.


👉 ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..


జగిత్యాల జిల్లా కేంద్రాన్ని మెడికల్ హబ్ గా మార్చేందుకు పూర్తి సహకారం అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు.  ఇందుకుగాను ₹ 57 కోట్ల 24 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయవలసిందిగా విన్నవించారు.


👉నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ₹ 6 కోట్ల 4 లక్షల 26 వేల 416, తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ద్వారా ₹ 6 కోట్ల 25 లక్షలు, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సర్జికల్, డ్రగ్స్ కోసం ₹ 74 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.


👉 అదేవిధంగా మెడికల్ కాలేజీ పెండింగ్ బిల్లులు ₹ 44 కోట్లు మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు.


👉 ధర్మపురి నుంచి రాయపట్నం, రాయపట్నం నుండి ధర్మారం రాజీవ్ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ధర్మపురిలో ట్రామా సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కి విన్నవించారు.


👉ఈ మేరకు మంత్రి దామోదర రాజ నరసింహ కు వినతిపత్రం సమర్పించారు.


👉 కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  పాయింట్స్


👉 మెట్ పల్లి  పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ బిల్డింగ్ త్వరగా పూర్తిచేయాలని కోరారు ఈ విషయాన్ని అసెంబ్లీలో పలుమార్లు విన్నవించానని గుర్తు చేశారు..


👉 మెట్ పల్లి పట్టణంలో ఒక మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నిర్మించాలని కోరారు..


👉 కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కాన్ మిషిన్ ఏర్పాటు చేయాలని కోరారు..


👉 కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి భవనం పూర్తయి నెలలు గడుస్తున్న అందులో వైద్యుల కొరత ఉన్నందున వైద్యులను నియమించాలని కోరారు..


👉 మల్లాపూర్,ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి, కోరుట్ల నాలుగు మండలాలకు అంబులెన్సులు కావాలని తెలిపారు..


👉 కోరుట్ల పట్టణంలో గల వంద పడకల ఆసుపత్రిలో అవసరమయ్యే పరికరాలను త్వరితగతన అందజేయాలని కోరారు..


👉 కోరుట్ల నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ భవనలను త్వరగా పూర్తి చేయాలని కోరారు..


👉 జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ..


ఉత్తర తెలంగాణకు జగిత్యాల కేంద్రంగా ఉన్నదని అన్నారు. సిరిసిల్ల మంచిర్యాల నిర్మల్ పెద్దపెల్లి కరీంనగర్ జిల్లాల నుండి వ్యవసాయ అవసరాలు, మార్కెటింగ్ నిమిత్తం ఎంతోమంది ఇక్కడకు వస్తుంటారని అన్నారు. అందువల్ల వైద్యపరమైన అవసరాలు జగిత్యాల జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.


👉 3 జాతీయ రహదారులు ఈ జిల్లాలోని కలుస్తాయని, బస్టాండ్ కు దగ్గరగా, కాలినడకల చేరుకునే విధంగా మెడికల్ కాలేజీ స్థలాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు.


👉 15వ ప్రణాళిక సంఘం నిధుల్లో నుండి జగిత్యాల జిల్లాకు 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ కేంద్రాలు ఇదివరకే మంజూరు చేయించానని మంత్రికి వివరించారు. అయినప్పటికీ జగిత్యాల జిల్లా అవసరాల దృశ్య అర్బన్ ప్రాథమిక కేంద్రాలు మరిన్ని మంజూరు చేయాలని కోరారు.


👉 ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున అంబులెన్సులు  మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు

.
👉 ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాయింట్స్


👉 వేములవాడ ఏరియా ఆసుపత్రిలో mch ఏర్పాటు చేయాలి..


👉 సూరమ్మ చెరువు రిజర్వాయర్ కుడి ఎడమ కాలువ భూ సేకరణ కోసం నిధులు మంజూరు చేయాలి..


👉 కాలికోట సూరమ్మ చెరువు పూర్తయి 43700 ఎకరాలకు సాగు నిరు అందించడం జరుగుతుంది..


👉 రైతుల 3 ఎకరాల భూమికి నష్టా పరిహారం మిగిలివుంది సాధ్యమైనంతగా వేగంగా నిధులు మంజూరు చేయాలి..


👉 వేములవాడ లో ట్రామా మంజూరు చేయడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలిపారు..