J.SURENDER KUMAR,
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ శ్రేణులు, అర్చకులు, వేద పండితులు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతించారు.


శనివారం రాత్రి ధర్మపురిలో బస చేసి మంత్రి తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వేద పండితులు వేదమంత్రాలు పట్టిస్తూ,మంగళ వాయిద్యాలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

మంత్రి, ఎమ్మెల్యే, భక్తులతో కలిసి శ్రీ స్వామివారి అభిషేక పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ నరసింహస్వామి హోమంలో పాల్గొన్నారు.

పూజాది కార్యక్రమాల అనంతరం ఆశీర్వచ మంటపంలో మంత్రి కి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ స్వామివారి శేష వస్త్రాన్ని ప్రసాదం చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్, పాలకవర్గ అధ్యక్షుడు జక్కు రవీందర్, ధర్మకర్తలు పాల్గొన్నారు.
👉 మంత్రి కి గార్డ్ ఆఫ్ ఆనర్ !

మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన నేపథ్యంలో ఆదివారం స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో పోలీస్ యంత్రాంగం మంత్రికి గార్డ్ ఆఫ్ ఆనర్ చేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.