మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి సోమవారం  వచ్చిన మంత్రి సీతక్కకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.


మంచిర్యాల్ జిల్లా నుంచి మంత్రి సీతక్క కాన్వాయ్ ధర్మపురి నియోజకవర్గంలో  రాయపట్నం గ్రామం వద్దకు చేరుకోగానే మంత్రి వాహనం దిగింది. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, చిత్రపటాన్ని మంత్రికి బహుకరించి స్వామి ప్రసాదం అందించారు. భారీ సంఖ్యలో  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ కండువాలు అందించారు.

ఇదే తరహాలో
ఎండపెల్లి మండలం రాజరంపల్లి వద్ద మంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్  ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మంత్రి వెంట అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ధర్మారం మండలంకు వెళ్లారు.