మంత్రి సురేఖ కృషివల్లే అంగరంగ వైభవంగా పుష్కరాలు !

👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు !


J.SURENDER KUMAR,


దేవాదాయ శాఖ మంత్రి   ప్రత్యేక కృషి వల్ల ఈ రోజు పుష్కరాలను అంగ రంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
మొట్టమొదటి సారి కాశిలో ఏవిధంగా హారతి ఇస్తారో సరస్వతి హారతి కాళేశ్వరంలో చేయాలని ముఖ్యమంత్రి  సూచన మేరకు కాశి నుండి పండితులను ప్రత్యేకంగా రప్పించడం   జరిగిందని అన్నారు.

కాళేశ్వరం లో సరస్వతి నవరత్న మాల స్తోత్రంతో తొమ్మిది హారతులు !

వారణాసి కాశీలో గంగా హారతిలు ఇచ్చే  7 గురు పండితులచే చేశారు.. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ 9 హారతులు ఆహుతులను మై మెరిపించాయి. కాళేశ్వరం లో సరస్వతి నవరత్న మాల స్తోత్రంతో తొమ్మిది హారతులు విశిష్టత !

👉 ఓంకార హారతి..సర్వ దోష నివారిణి !

👉 నాగ హారతి… సర్పదోషాని పోగొట్టి          ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది !

👉 పంచ హారతి…  దీర్ఘాయుష్షు కు !

👉 సూర్య హారతి.. రోగాలను మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది !

👉 చంద్ర హారతి… పాడి పంటలను, మనశ్శాంతి నిస్తుంది!

👉 నంది హారతి… -ధర్మ బుద్ధిని, శక్తిని, విద్య బుద్ధినిస్తుంది.!

👉 సింహ హారతి… నాయకత్వాన్ని ధైర్యాన్నిస్తుంది !

👉 కుంభ హారతి …. సంపదను ఇచ్చి, కోటి సుఖాలను అందిస్తుంది

👉 నక్షత్ర హారతి…నిర్మలమైన మనస్సును, కీర్తిని అందిస్తుంది.!

👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ

భక్తుల సౌకర్యార్ధం టెంట్ సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అన్ని శాఖల సమన్వయంతో రాబోవు  11 రోజుల పాటు జరిగే పుష్కరాలను విజయ వంతంగా నిర్వహించ బోతున్నామని అన్నారు. మాదవానంద సరస్వతి సూచన మేరకు దేవాలయాల పవిత్రను కాపాడాలని కోరారు.
ముఖ్య మంత్రి  సూచనల మేరకు ఈరోజు కాళేశ్వరం లో సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తున్నామని,  పెద్ద  చరిత్ర కలిగిన  కాళేశ్వరానికి మాస్టర్ ప్లాన్ ద్వారా నిధులు కేటాయించాలని కోరారు.   గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని సీఎంను కోరారు.

మారుమూల ప్రాంతం అయిన కాళేశ్వరం టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలని కోరారు.
20 సంవత్సరాల కాలంలో పెండింగ్  ఉన్న చిన్న కాళేశ్వర ప్రాజెక్ట్  పనుల ముఖ్యమంత్రి  ప్రత్యేక చొరవ వల్ల విజయ వంతంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని,
మళ్ళీ ఒక్క సారి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రావాలని కోరుతున్నామని తెలిపారు.

తన తండ్రి శ్రీపాదరావు ఆశయాల మేరకు నియోజక వర్గం అభివృద్ధి చేస్తున్నామని,
సీఎం  ప్రత్యేక చొరవతో ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్  చొరవతో ₹ 3 కోట్ల రూపాయలుతో బస్టాండ్ నిర్మాణానికి  నిధులు విడుదల చేసినందుకు  ధన్యవాదాలు తెలిపారు.

👉 దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ

పుష్కరాలను అంగరంగ వైభవంగా జరగాలని గొప్ప సంకల్పంతో ఈరోజు పుష్కరాలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

దేశంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూస్తున్నాయని, గతంలో ఎన్నడు లేని విధంగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ప్రత్యేక కృషి వల్ల భక్తుల సౌకర్యార్ధం సరస్వతి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దేవాదాయశాఖ తో పాటు ఇతర శాఖల అధికారులు ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేశారని అభినందించారు.

తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలను గగనంగా నిర్వహించి కుంటున్నామని, ఇదే స్ఫూర్తితో
రాబోయే రోజుల్లో వచ్చే గోదావరి, ప్రాణహిత , కృష్ణ పుష్కరాలు, మేడారం జాతరలను ఘనంగా నిర్వహించబోతున్నామని అన్నారు. భక్తుల వేసవి దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని గోదావరి పరిసరాల్లో భక్తులు స్నానాలు చేసి వ్యర్థాలను  గోదావరిలోను, పరిసరాల్లో వేయకుండా పరిశుభ్రత పాటించాలని కోరారు.

అధికారులు మిగిలిన 11 జరగబోయే కార్యక్రమాలను నిబద్ధతతో పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలని. సూచించారు. భక్తుల పుష్కర స్నానం చేసి క్షేమంగా ఇంటికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇంత పెద్ద పెద్ద ఎత్తున పుష్కరాలకు  ఏర్పాట్లు చేసిన అధికారులను అభినందించారు.

👉 మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ

రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ఈ రోజు ఇంత ఘనంగా సరస్వతి పుష్కరాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశ ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కాంక్షించి ఈ పుష్కరాలను నిర్వహించడం శుభ సూచకమని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్న ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన ముఖ్య మంత్రి  ధన్యవాదాలు తెలిపారు.

👉 రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ

మహాకాళీ, మహాలక్ష్మీ కటాక్షాలతో తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి కటాక్షంతో  మంచి విద్యను విద్యార్థులను అందించాలని సరస్వతి అమ్మ వారి కటాక్షం ఉండాలని కోరుతూ ఎంత పెద్ద ఎత్తున పుష్కరాలకు ఏర్పాట్లు చేసిన  ముఖ్య మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఏర్పాట్లు చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు.


ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్ కుమార్,  శాసన సభ్యులు, గండ్ర సత్యనారాయణరావు, మక్కన్ సింగ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ వినయ్ క్రిష్ణా రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు, ఎస్పి కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కాశీ పండితులు 45 నిమిషాల పాటు నిర్వహించిన  సరస్వతి నవరత్న హారతి కార్యక్రమాన్ని వీక్షించారు.  ఈ సందర్భంగా పేల్చిన బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.