మంత్రివర్గ విస్తరణలో మాదిగ వర్గానికి పదవి ఇవ్వండి !


👉 విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి వినతి పత్రం !


J.SURENDER KUMAR,

రాష్ట్ర జనాభాలో సుమారు 9% ఉండి కూడా, మంత్రివర్గంలో సముచిత ప్రాతినిధ్యం లేదని త్వరలో చేపట్టనున్న  మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ సహచర ఎస్సీ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  మర్యాద పూర్వకంగా కలిసి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు.

👉 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  మాదిగ సమాజం, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చి, పార్టీ  విజయంలో కీలకపాత్ర పోషించిందని వినతి పత్రంలో పేర్కొన్నారు.

👉 తెలంగాణలో షెడ్యూల్ క్యాస్ట్ ( S  C ) సామాజిక వర్గంలో మూడొంతులు మాదిగలు ఉన్నప్పటికీ, కీలక పదవులలో మాదిగల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనీ, వివరించారు.

👉 క్యాబినెట్ లో  కేవలం ఒక మాదిగ ఉప వర్గానికి మాత్రమే ఒకే ఒక్క మంత్రి పదవి ఇవ్వబడింది వివరించారు..

👉 ప్రధాన మాదిగ సామాజిక వర్గానికి, రాష్ట్ర జనాభాలో సుమారు 9% ఉండి కూడా, మంత్రివర్గంలో సముచిత ప్రాతినిధ్యం లేదని  పత్రంలో పేర్కొన్నారు.

👉 చేవెళ్ల డిక్లరేషన్ మరియు తెలంగాణ శాసనసభలో ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లు. మాదిగ సమాజానికి సంబంధించిన జనబా లెక్కలు, మరియు ఆర్థిక విషయాలను పరిగణలోకి తీసుకోవాలని, అందులో కోరారు.

👉 గత బి ఆర్ఎస్ ( కెసిఆర్) ప్రభుత్వ హాయంలో  మాదిగలకు మంత్రివర్గ ప్రాతినిధ్యం లేదనీ, కావున మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి ఒక అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన వినతి పత్రంలో మాదిగ శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు.