👉 ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మా మాదిగ వర్గానికి న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి విజ్ఞప్తి చేశామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బుధవారం మీడియా సమావేశంలో విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
👉 త్వరలో విస్తరణ చేపట్టనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మా మాదిగ వర్గానికి న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ కలిశామన్నారు.
👉 2011 జనాభా లెక్కల ప్రకారం,తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన జనాభా సుమారు 32 లక్షలకు పైగా ఉందన్నారు.
👉 గౌరవ సుప్రీం కోర్టు తీర్పు అనంతరం భారత దేశంలో ఏ రాష్ట్రం అమలు చెయ్యని విధంగా ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి చట్ట సభల్లో ఎస్సీ వర్గీకరణను ప్రవేశ పెట్టి ఆమోదించడం జరిగిందన్నారు.
👉 ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మాదిగ సమాజం, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి, పార్టీ విజయానికి సహకరించామన్నారు.
👉 గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మాదిగలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు.
👉 మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం కోసం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , ఏఐసీసీ మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరడం జరిగిందన్నారు.
👉 కాంగ్రెస్ అధిష్టానం అపాయింట్మెంట్ మాకు లభిస్తే డిల్లీ కి వెళ్ళి వారిని కూడా కలిసి మా అభ్యర్థలను వివరించి మాదిగలకు మంత్రివర్గంలో ప్రాతినిత్యం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని విప్ లక్షణ్ కుమార్ అన్నారు