మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ?

👉 కగార్ ఆపరేషన్ తో కకావికలమవుతున్న మావోయిస్టులు !


J.SURENDER KUMAR,


కేంద్ర భద్రతా దళాలు అమలు చేయనున్న ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తో మార్చి 2026 కి ముందు గా  నే మావోయిస్టు కార్యకలాపాలు నిర్మూలించడమే భద్రతా దళాల లక్ష్యంగా ఆ దిశలో ఆపరేషన్ మొదలైంది.


మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటిస్తున్న తరుణంలోనే వారి లొంగుబాటు సంఖ్య పెరుగుతున్నది.


ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులోని కర్రెగట్టలు కొండలలో 21 రోజుల జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఆపరేషన్ గా బీజాపూర్  CRPF డీజీ జీపీ సింగ్   ప్రెస్ మీట్ లో అన్నారు.


  నక్సలిజాన్ని నిర్మూలించడానికి హోంమంత్రి అమిత్ షా విధించిన మార్చి 31, 2026 గడువుకు ముందే ముగింపు పలకడానికి , భద్రతా దళాలు పథకం రచించారు.


మావోయిస్టుల ప్రభావిత, ఆధిపత్య ప్రాంతాలలో నిరంతర కార్యకలాపాలతో  మావోయిస్టుల కదలికలు కట్టడి, అణచివేయడం సానుభూతిపరుల పై ఒత్తిడిని కొనసాగించడం, సానుభూతిపరులకు మావోయిస్టులకు కమ్యూనికేషన్ గ్యాప్ ( కొరియర్ సమాచార వ్యవస్థ కు కట్టడి )  వారికి పట్టున్న ప్రాంతాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ మావోయిస్టులను ఒక్కరి బిక్కిరి చేయడంతో   లొంగిపోవడం లేదా ?  కొనసాగడమా  అనే ఒత్తిడి పెంచడమే ఫారెస్ట్ ఆపరేషన్ బ్లాక్ లక్ష్యం  భద్రత దళాలు ఎంచుకున్నట్టు సమాచారం.


  మావోయిస్టు దళాలు ప్రస్తుతం ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతం, పశ్చిమ బస్తర్, దక్షిణ బస్తర్, తెలంగాణ మరియు కొన్ని ఇతర రాష్ట్రాలలో. కకావికలమయ్యారు.


ఇప్పటికే, సీపీఐ(మావోయిస్టు) కాల్పుల విరమణ మరియు చర్చలను కోరుతూ 5-6 విజ్ఞప్తులు చేశాయి,
సిపిఐ (మావోయిస్ట్) అగ్ర నాయకత్వం  అజ్ఞాతంలో నుండి బయటకు వస్తే చర్చల అంశంపై పరిశీలిస్తామంటూ భద్రతా దళాలు నిర్మొహమాటంగా స్పష్టం చేశాయి. 

ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి మావోయిస్టు అగ్రనాయకత్వం చర్చలకు వస్తే పరిశీలిస్తామని భద్రతా దళాల ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. .


ఈ సంవత్సరం మావోయిస్టులు  లొంగుబాటులు మొదటి నాలుగు నెలల్లో 718 మంది  ప్రధాన స్రవంతిలోకి చేరారు,
  నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలతో ఒత్తిడి పెరిగేకొద్దీ, మరిన్ని లొంగుబాటులు వస్తాయి  మావోయిస్టు అగ్రనాయకత్వం మౌనంగా, సురక్షితంగా ఉండటంతో  యాక్షన్ దళాలలో అసంతృప్తి నెలకొందని నిఘవర్గాల హోం మంత్రిత్వ శాఖకు ఇచ్చిన సమాచారం మేరకు. ఆపరేషన్ బ్లాక్‌ఫారెస్ట్‌ కు శ్రీకారం చుట్టారు.


మావోయిస్టు అగ్ర నాయకులు, రహస్య స్థావరాల ను నిఘవర్గాల సమాచారం మేరకు ఆయా ప్రాంతాలలో  మరిన్ని భద్రత దళాల బేస్ క్యాంపులతో పాటు నిరంతర గాలింపులు కు  కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది.