J.SURENDER KUMAR,
మావోయి స్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి
సుప్రీం కమాండర్, నంబాల కేశ వరావు
ఎన్కౌంటర్ లో హతమై పార్టీ కాక వికలమైన దశలో
నూతన సుప్రీం కమాండర్ ను పార్టీ నియమిస్తుందా ?
నియమించే పరిస్థితి దండకారణ్యంలో ఉందా ?
కేశవరావు బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే అంశం పై
ప్రచార సాధనాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ ప్రచారానికి సాను భూతిపరుల్లో
చర్చ మొదలైంది అనే వ్యాఖ్యానం జోడిస్తున్నారు.
నంబాల కేశవరావు @ బసవరాజు మృతి , ఎన్కౌంటర్ జరిగిన తీరు, ఎన్కౌంటర్ లో హతమైన వారి పేర్లతో మావోయిస్టు పార్టీ శుక్రవారం నాటికి ఎలాంటి ప్రకటన చేయలేదు.
దీనికి తోడు బసవరాజు మృతదేహం స్వగ్రామానికి గాని, అతడి బంధువులకు గాని భద్రత దళాలు అప్పగించలేదు.
ఈ నేపథ్యంలో
పార్టీకి కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో ఎవరు రావచ్చు అనే చర్చ ? దానికి తోడు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు ఊహగానాలతో కథనాలు.
దండకారణ్యంలో భద్రత దళాల ముప్పేట దాడుల్లో గత ఐదు నెలల కాలంలో దాదాపు 200 మందికి పైగా మావోయిస్టులు, ఆ పార్టీ కీలక నేతలు, దళసభ్యులు హతమవుతూనే ఉన్నారు. వందలాది మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోతున్నారు.
దండకారణ్యంలో నిత్యం భద్రత దళాల గాలింపు, డ్రోన్లు, హెలికాప్టర్ల సంచారం ఆపరేషన్ కగర్, ఆపరేషన్ ‘బ్లాక్ ఫారెస్ట్’ పక్కా ప్రణాళికలతో మావోయిస్టుల ఏరివేతకు భద్రత దళాలు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
1980 లో ఆవిర్భవించిన పీపుల్స్ వార్ నక్సలైట్ పార్టీ , 2004 లో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన నాలుగున్నర దశాబ్దాల కాలంలో ‘ తాము భేషరతుగా కాల్పుల విరమణ చేస్తున్నాం, ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధం అంటూ ‘ బహిరంగంగా ఐదు సార్లు పత్రిక ప్రకటన చేయడం, పాత్రికేయులు, ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల నాయకులు, శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రకటనలో పేర్కొంటున్నారు.
మావోయిస్టు పార్టీలో నెలకొన్న గందరగోళం, భయానక వాతావరణం, కకావికలమైన. దళాల, దళ నాయకుల ఆచూకీ తెలియక ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి, పేరుతో ఓ సారి , మరోసారి మరో అధికార ప్రతినిధి పేరున శాంతి చర్చల ప్రకటనలు వెలువడుతున్న తరుణంలో మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితి అంచనా వేయవచ్చు.
👉 ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ !
మావోయిస్టుల కట్టడికి తెలంగాణ పోలీసులు శ్రీకారం చుట్టిన కోవర్ట్ ఆపరేషన్, మావోయిస్టు స్మారక స్థూపాలు కూల్చివేత, నక్సల్స్ ప్రభావితకు గ్రామాల్లో వైద్య శిబిరాలు, పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, దుస్తుల పంపిణీ సానుభూతిపరులను ఇన్ఫార్మర్లుగా, పోలీస్ శాఖలో హోంగార్డులుగా, దళ సభ్యులను పోలీస్ కానిస్టేబుల్స్ గా గ్రామాలలో ప్రత్యేక పోలీస్ క్యాంప్ ల ఏర్పాటు. తదితర విధానాలు ప్రస్తుతం దండకారణ్యంలో భద్రత దళాలు ఆచరిస్తూ అమలు చేస్తున్నాయి.
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తో మావోయిస్టులకు కొరియర్ సమాచార వ్యవస్థ బ్రేక్ అవుతుంది. వారి రహస్య స్థావరాలకు ఆహారం, వైద్య సరఫరా సానుభూతిపరులతో చేరదు. పశువుల కాపరులు, వ్యవసాయ కూలీల పై నిరంతర నిఘా ఉంటుంది. మావోయిస్టులు ‘ డెన్ ‘ లో దాచుకున్న ఆయుధాలు తీసుకునే పరిస్థితి ఉండదు.
మావోయిస్టు ప్రాబల్యం ఆదివాసి గ్రామాల్లో భద్రతా దళాల బేస్ క్యాంపులు ( అవుట్ పోస్టులు) ఏర్పాటు. మావోయిస్టుల కదలికలు కట్టడి చేసే ప్రణాళిక నే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. దీనికి తోడు భద్రతా దళాలలో సహాయకులుగా ( హోంగార్దులు గా ) ఆదివాసి యువకులను ( రిక్రూట్ ) విధులు నిర్వహించడం తో మావోయిస్టుల కమ్యూనికేషన్ వ్యవస్థను కట్టడి చేస్తూ భద్రత బలగాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇలాంటి వాతావరణం లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిని నియమించడానికి ఆయా రాష్ట్రాల పార్టీ కీలక నాయకులతో ప్లీనరీ నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఉనికి చాటుకోలేని దుస్థితిలో ఉన్న పార్టీ, ప్లీనరీ నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందో ? ఊహాగాహనాల కథనాలను చదవాల్సిందే.
గతంలో మావోయిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి నియామకంలో నే ప్రాంతాలవారీగా(డివిజన్) దళా నాయకులతో ప్లీనరీ నిర్వహించేవారు.
ఇది ఇలా ఉండగా గతంలో కరీంనగర్ జిల్లా నక్సలైట్ పార్టీ కార్యదర్శి విజయ్ రామగిరి అడవుల్లో తోటి నక్సలైట్ హతమార్చి ఆయుధాలతో పరారై పోలీసులకు లొంగిపోయాడు.
జరిగిన సంఘటన వివరించడానికి నక్సలైట్ నాయకులు, కొందరు పాత్రికేయులను అడవిలోకి పిలిచి కోవర్టు జడల నాగరాజు ఎలా చేశాడు , పోలీస్ అధికారులు అతడిని ఎలా కోవర్టు కోసం వాడుకున్నారో వివరించారు.
ఇందులో ఓ పాత్రికేయుడు, మీరు కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎవరిని నియమిస్తున్నారు ? ఎప్పుడు నియమిస్తున్నారు ? ఈ దళ నాయకుడు అవుతాడా ? అంటూ ప్రశ్నించడంతో వారు మాకు జరిగిన నష్టం, కోవర్టు తీరును నీకు వివరిస్తున్నాము. నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని జిల్లా కార్యదర్శిగా ప్రకటించుకో, మేము ప్రకటించినట్టు పత్రికలో రాసుకో అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల నాయకులు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చల జరపాలని కోరుతున్న తరుణంలో మావోయిస్టు పార్టీ నూతన కేంద్ర కమిటీ కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలు అప్పగించే పరిస్థితి మాత్రం ఉండకపోవచ్చు ఏం జరగనున్నదో వేచి చూడాల్సిందే.