J.SURENDER KUMAR,
మీ అభిమానం, మీ శ్రమ ఫలితమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడ్డా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
👉జైహింద్ యాత్ర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్….
👉 పహల్గామ్ లో భారతీయుల గుండెల్లో తూటాలు దించిన ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండొద్దని ఆనాడు నెక్లెస్ రోడ్ వేదికగా నినదించాం
👉 ప్రపంచ పటంలో పాకిస్థాన్ కనిపించొద్దని…ఇందుకు ప్రధానికి మనమంతా మద్దతుగా ఉంటామని ప్రకటించాం

👉 అఖిలపక్ష భేటీకి హాజరై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే స్పష్టంగా కేంద్రానికి మద్దతు పలికారు
👉 పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలుపుకునేందుకు పాక్ పై యుద్ధం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
👉 కానీ నాలుగు రోజుల యుద్ధం తరువాత ఏం జరిగిందో గానీ అర్ధాంతరంగా మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని ముగించింది
👉 యుద్ధ విరమణ చేసే ముందు ఎందుకు అఖిలపక్షం అభిప్రాయం తీసుకోలేదు..?
👉 గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధ తంత్రాన్ని నడిపించగలడు..

👉 ఆనాడు చైనాపై యుద్ధం ప్రకటించి చైనాకు గట్టిగా బుద్ధి చెప్పిన ఘనత ఇందిరమ్మది
👉 మన ఆర్మీ జవాన్ కల్నల్ సంతోష్ ను చైనా పొట్టన పెట్టుకుంటే మోదీ కనీసం చైనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయలేదు
👉 1971 లో భారత్- పాక్ యుద్ధ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పిన ధీశాలి ఇందిరమ్మ
👉 ఆనాటి యుద్ధంలో ఇందిరమ్మ పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసి చూపారు.
👉 ఇందిరమ్మ స్ఫూర్తితో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయాలని.. ఇందుకు మద్దతుగా ఉంటామని నేను ప్రకటించా…
👉 దేశ ప్రజలు వీరతిలకం దిద్ది యుద్ధం చేయమంటే ట్రంప్ చెప్పాడని మోదీ యుద్ధం విరమించారు
👉 మరి ఇవాళ దేనికోసం బీజేపీ నేతలు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు?
👉 యుద్ధం మీ సొంత వ్యవహారం కాదు… దేశ భద్రత అంశం
👉 మోదీ ప్రభుత్వం దేశ భద్రతను ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు.
👉 భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే… వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కాంగ్రెస్ జైహింద్ యాత్ర చేపట్టింది
👉 దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గాంధీ కుటుంబానిది
👉 మోదీ కాలం చెల్లిన నాణెం లాంటి వారు…
👉 దేశానికి రాహుల్ గాంధీ లాంటి నాయకుడు కావాలి
…
👉 రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చూసే వరకు మనం విశ్రమించొద్దు