మోదీ ప్రభుత్వం తెలంగాణకు దాదాపు ₹ 11 లక్షల కోట్ల ఖర్చు చేసింది !

👉 బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి  అమర్ నాథ్ సారంగుల !

J.SURENDER KUMAR,

2014 నుండి ఇప్పటివరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు దాదాపు 11 లక్షల కోట్ల ఖర్చు చేసింది.గత 16 నెలల్లో కేంద్రం అనేక రకాలుగా సహకరించినా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి  అమర్ నాథ్ సారంగుల అన్నారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  అమర్ నాథ్ సారంగుల వివరాలు వివరించారు.

👉 మీడియా సమావేశంలో ప్రధాన అంశాలు !

2014 నుండి నేటి వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు దాదాపు ₹11 లక్షల కోట్ల ఖర్చు చేసింది.గత 16 నెలల్లో కేంద్రం అనేక రకాలుగా సహకరించినా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి.

👉 2024 ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి  ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు, పెండింగ్ ప్రాజెక్టులపై హోంవర్క్ ఇచ్చారు. మొబైల్ కనెక్టివిటీ కోసం నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో రూ. 32,797 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

👉 దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్సారెస్పీ స్టేజ్–2, రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.18,189 కోట్లు పెండింగ్. ఎయిమ్స్–బీబీనగర్‌కు రూ.1,366 కోట్లు, మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్, కాజీపేట–విజయవాడ థర్డ్ లైన్‌కు రూ.3,113 కోట్లు పెండింగ్.

👉 చిన్నచిన్న కారణాలతో 71,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఏప్రిల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  హైవేలకు  భూసేకరణ ఆలస్యం గురించి, లేఖలో  పెండింగ్ ప్రాజెక్టులను వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

👉 భారత స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు తెలంగాణలో కేవలం 2500 కి.మీ. మాత్రమే జాతీయ రహదారులు ఉంటే.. మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 11 ఏండ్లలో 1 లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,500 కి.మీ. పైనే జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది.

👉 691 కి.మీ. మేర 16 జాతీయ రహదారుల ప్రాజెక్టులు కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వివిధ దశల్లో పెండింగులో ఉన్నయి. దీనికి పెట్టే ఖర్చు రూ. 12,619 కోట్లు.

👉 రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉంటే.. 32 జిల్లాలకు జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉంది. మరి ఆ ఘనత నరేంద్ర మోదీదే.

👉 రైల్వే ప్రాజెక్టుల విషయంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కావొచ్చు… ఫ్లైఓవర్లు కావొచ్చు.. రాష్ట్రంలో 40 అమృత్ రైల్వే స్టేషన్లు,.. ఇలా అనేక రైల్వే ప్రాజెక్టుల కోసం 80 వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం ఆ ప్రాజెక్టులకు యాక్సెస్ రోడ్లు ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది.

👉 రైల్వే ప్రాజెక్టుల్లో కేంద్రం 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా, రాష్ట్రం యాక్సెస్ రోడ్లను ఇవ్వకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయి. చర్లపల్లి, కాజీపేట, సికింద్రాబాద్ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన అప్రోచ్ రోడ్లు ఇవ్వని కారణంగా అభివృద్ధి ఆలస్యం అవుతోంది.

👉 మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ కు మొత్తం వ్యయం: రూ. 1,854 కోట్లు, అందులో రాష్ట్ర వాటా: రూ.926.93 కోట్లు, అయితే పెండింగ్ నిధులు రూ. 511.2 కోట్లుగా ఉన్నాయి.

👉 భద్రాచలం–కొవ్వూరు రైల్వే లైన్ కు రాష్ట్ర వాటా రూ. 511.2 కోట్లు పెండింగ్, భూసేకరణ పూర్తికాక జాప్యం నెలకొంది. రాష్ట్రంలో కేంద్రం రూ.1.8 లక్షల కోట్లు రోడ్ ప్రాజెక్టులకు మంజూరు చేసింది.

👉 రూ.32,797 కోట్ల విలువైన మొబైల్ కనెక్టివిటీ పథకాలు అభివృద్ధి లో ఉన్నాయి.రూ.1,366 కోట్లతో బీబీనగర్ AIIMS, ఇతర మేడికల్ కళాశాలల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి.కానీ వీటికి భూములు, వాటా నిధులు ఇవ్వడంలో రాష్ట్రం విఫలమైంది.

👉 రెండు ప్రాజెక్టుల వల్ల వెనుకబడ్డ ప్రాంతాలు, ప్రముఖ శ్రీరామచంద్రమూర్తి ఆలయం క్షేత్రమైన భద్రాచలానికి  రైలు కనెక్టివిటీ లభించేది – కానీ రాష్ట్ర నిర్లక్ష్యంతో ఆగిపోయాయి. ఇతర రాష్ట్రాలు రెఫార్మ్స్ చేసి వేల కోట్లు పొందుతున్నా, తెలంగాణ మాత్రం చిన్నచిన్న సంస్కరణలు కూడా చేయకపోవడం వల్ల నిధులు కోల్పోయింది.

👉 “రెవెన్యూ ఉన్నా రెస్పాన్స్ లేదు – అభివృద్ధి విషయంలో కోటలు దాటే మాటలు.. గడప దాటని చేతలు” రూ. 12,500 కోట్లు (2,500 కిమీ నిర్మాణం ఆలస్యం) అంచనా వ్యయంతో చేపట్టే జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో మొత్తం 16 ప్రాజెక్టుల్లో భూసేకరణ పెండింగ్. అవసరమైన భూములు: 1,550.529 హెక్టార్లు కాగా పెండింగ్ భూములు: 646.432 హెక్టార్లు

👉 హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (దక్షిణ భాగం) కు భూసేకరణలో రాష్ట్ర భాగస్వామ్యం నిర్ధారించకపోవడం వల్ల NH డిక్లరేషన్, DPR ఆమోదాలు నిలిచిపోయాయి.

👉 సెంట్రల్ రిఫార్మ్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం అంటే.. 2025 కేంద్ర బడ్జెట్ లో దాదాపు 1 లక్షా 50 వేల కోట్ల రూపాయలు SASCI పథకం మరియు లాంగ్ టర్మ్ ఇంట్రస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడానికి కొన్ని సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్ చేయాలని చెప్తే అవికూడా చేయలేక ఇప్పటివరకు కేవలం రూ. 170 కోట్లు మాత్రమే ఈ పథకం కింద తెచ్చుకోవడం జరిగింది.

👉 2025 బడ్జెట్‌లో రూ. 1.5 లక్షల కోట్లు SASCI పథకం కింద రాష్ట్రాలకు ఇవ్వడానికి సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్ చేయాలని సూచించినా, తెలంగాణ కేవలం రూ.170 కోట్లు మాత్రమే పొందగలిగింది.

👉 వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అమలు జాప్యం, పారిశ్రామిక లైసెన్సింగ్ & క్లియరెన్స్ డిజిటలైజేషన్ లోపం, వాహన స్క్రాపింగ్ పాలసీ వంటి వాటికోసం రూ. 176.5 కోట్లు విడుదల చేసినా రాష్ట్రం యాక్షన్ ప్లాన్ లేదు.

👉 ట్రాఫిక్ చలానాలు, భవనాల ఆధారంగా ఆస్తి పన్ను విధానం, భూమికి ఆధార్ అనుసంధానం, యూనిక్ ప్రాపర్టీ ఐడీ, స్టాంప్ డ్యూటీ రేషనలైజేషన్ – ఇవన్నీ చేయడం ద్వారా రాష్ట్రానికి జీడీపీ లో 2% మేరకు అదనపు రూ. 28 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది.

👉 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  1 లక్షా 60 వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలని అడుగుతూనే మరోపక్క రాష్ట్ర పౌరులకు ఉపయోగపడే వన్ నేషన్-వన్ రేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీలు) మరియు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ చేయలేక మొన్నటికిమొన్న నీతిఆయోగ్ సమావేశం కూడా మళ్లీ అదే పాత పాట పాడుతున్నారు.

👉 బిజెపి పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులిస్తున్నారని… బిజెపి పాలిత రాష్ట్రాలపైన విమర్శలు చేయడం మాని ఇలాంటి ప్రజలకు డైరెక్ట్ గా ఉపయోగపడే రిఫార్మ్స్ (సంస్కరణలు)ను తీసుకురావడం ద్వారా మరిన్ని ఎక్కువగా నిధులు పొందవచ్చు.

👉 ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిద్రలేచి, మోదీ ప్రభుత్వం నిధులివ్వట్లేదనే అబద్ధాలు మానేసి.. ఇంకా ఎక్కువ నిధులు తెచ్చుకునే మార్గాలను అందిపుచ్చుకోవాలి.

👉 ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సలహాలు స్వీకరించి, అభివృద్ధిపై, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వినియోగించుకునేలా, రిఫార్మ్స్ పై దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

👉 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ఎవ్వరు అప్పు ఇస్తలేరు.. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుపోయేటోళ్లను చూసినట్లు చూస్తున్నరనే.. దిగజారుడు మాటలు మానేసి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాను పెంచే విధంగా నడుచుకోవాలని భారతీయ జనతా పార్టీ నుంచి సలహా ఇస్తున్నాం. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.

👉 మరోవైపు తాజాగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్ లో వరికి రూ. 69 మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో   క్వింటాల్ వరి మద్దతు ధర  రూ.2300 నుంచి రూ.2369  కి చేరింది.  కేంద్రం MSP కోసం  రూ. 2.70 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది.

👉 అంతేకాకుండా రైతులకు వడ్డీ రాయితీ కింద  రూ.15,642 కోట్ల రూపాయలు కేటాయించింది. పెట్టుబడిపై రైతులకు 50 శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర కేబినెట్ కు తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ ముగించారు.