ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు !

👉 ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  !


J.SURENDER KUMAR,


తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్  ఆధ్వర్యంలో  2024-25 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబర్చిన షెడ్యూల్ కుల (SC) వర్గాలకు చెందిన విద్యార్థులకు బుధవారం ప్రధానం చేయనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ లకు  ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు అని అన్నారు.

అవార్డుల కార్యక్రమం గూర్చి ముఖ్యమంత్రి కి వివరించిన వెంటనే వారు  కార్యక్రమంలో పాల్గొనందుకు కృతజ్ఞతలు అని విప్ లక్ష్మణ్ కుమార్ తన స్వాగతోపన్యాసంలో  పేర్కొన్నారు.

👉 ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ …

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు   ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యార్థుల డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచడం జరిగిందని,  స్వయంగా నా నియోజకవర్గంలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో నేను జిల్లా కలెక్టర్  కలిసి విద్యార్థులతో భోజనం చేశామన్నారు.

👉 విద్యార్థులకు ఏ రోజు ఎలాంటి భోజనం ఉంటుందో కచ్చితంగా డైట్ మెను ప్రకారం అందిస్తున్నామన్నారు.
నా నియోజకవర్గంలో దాదాపు వంద కోట్ల రూపాయలతో అన్ని వర్గాల విద్యార్థుల కొరకు ఇంటిగ్రేటెడ్  పాఠశాలను ప్రభుత్వం మంజూరు  చేసిందని విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి  విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ  కార్పరేట్ పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి విద్య అందుతుందో అదే తరహా విద్య ప్రతి పేద విద్యార్థికి  అందించాలనే దృడ సంకల్పంతో సీఎం, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం   కార్యాచరణ అమలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తన ప్రసంగం ముగించారు.