J.SURENDER KUMAR,
ఆకస్మికంగా మృతి చెందిన ధర్మపురి మున్సిపల్ పారిశుద్య కార్మికుడి కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, సతీమణి కాంతా కుమారి ఆర్థిక సహాయం చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణంలోని న్యూ హరిజనవాడకు చెందిన భూమరాజు తాత్కాలిక ఉద్యోగిగా మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నాడు . గత ఆరు నెలలుగా నెల నెల జీతాలు రావడం లేదు. దీంతో తీవ్ర మానసిక వేదన తో శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు.

ఎమ్మెల్యే సతీమణి మృతదేహానికి నివాళులర్పించి మృతుని కుటుంబానికి ఆమె ₹ 10 వేల నగదు అందించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని వారికి ధైర్యం చెప్పారు.