J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సీనియర్ నాయకుడు ,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అక్కెనపెల్లి సునీల్ కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు.

స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శనివారం సునీల్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్న వయసులో సునీల్ ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరం అని అన్నారు.
👉 మాజీ జెడ్పిటిసి సభ్యుడిని పరామర్శించిన ఎమ్మెల్యే !

పెగడపెల్లి మండల మాజీ జడ్పీటీసీ సభ్యుడు కాసుగంటి రాజేందర్ రావు, మాతృమూర్తి ప్రమిల అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. శనివారం కరీంనగర్ లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ప్రమీల మృతదేహానికి నివాళులర్పించి, రాజేందర్ రావ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంతిమయాత్ర దహన సంస్కారాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.