నంబల కేశవరావుకు చైనా మావోయిస్టు పార్టీ నివాళి !

👉 అందుకే  మృతదేహం  అప్పగించలేదా ?


J.SURENDER KUMAR,


భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు @ బసవరాజుకు, చైనా మావోయిస్టు పార్టీ ఈనెల 25 న నివాళులర్పించారు. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మరో 27 మంది మావోయిస్టులకు సైతం వారు నివాళులర్పిస్తూ వీడియో విడుదల చేశారు.


చత్తీస్గడ్ అడవుల్లో మంగళవారం పోలీసులు నంబాల కేశవరావు తో పాటు మరో 27 మంది మావోయిస్టుల మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

👉 అందుకే అప్పగించలేదా ?

ప్రస్తుతం మావోయిస్టుల అలికిడి లేని ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు దహన సంస్కారాల,  సందర్భంగా ఊరేగింపులు, విప్లవ నినాదాలు, వేల  సంఖ్యలో సానుభూతిపరులు, ప్రభుత్వానికి లొంగిన మాజీ నక్సల్స్  శ్రీకాకుళం జిల్లాకు తరలి రానున్నారు అని  కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలకు నిఘవర్గాల ఇచ్చిన సమాచారం మేరకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నంబాల కేశవరావు  బంధువులకు మృతదేహాన్ని అప్పగించలేదని సమాచారం.

శ్రీకాకుళం జిల్లాలో దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న నక్సలైట్ ఉద్యమం ప్రస్తుతం అక్కడ ఉనికి ఉలుకు పలుకు లేదు.    నంబాల  కేశవరావు  దహన సంస్కారాల అక్కడ జరిపితే అదో పర్యట కేంద్రంగా మారనున్నదని  కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ముందస్తు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.


శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియాగూడ చెందిన కేశవరావు రక్తసంబంధికులు, పౌర హక్కుల సంఘ నాయకులు కేశవరావు అంతిమ దహన సంస్కారాలు తమ సాంప్రదాయం ప్రకారం జరుపుకుంటామని పోలీస్ యంత్రాంగాన్ని కోరారు, ప్రాధేయపడ్డారు. వీధి లేని పరిస్థితులు హైకోర్టును ఆశ్రయించి నంబాల మృతదేహం రక్తసంబంధికులకు  అప్పగించాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు  ఉత్తర్వులు  జారీ చేసింది.

ఏపీ పౌర హక్కుల సంఘం నాయకులు, బంధువులు చత్తీస్గడ్ ,ఏపీ పోలీసు యంత్రాంగాన్ని ప్రాధేయపడిన  మృతదేహం  అప్పగించలేదని విషయం తెలిసిందే.