J.SURENDER KUMAR,
బడుగు బలహీన వర్గాల నాయకుడు, నవ భారత నిర్మాణ సృష్టికర్త, దేశానికి దిశా నిర్దేశం చూపిన మార్గదర్శకుడు రాజీవ్ గాంధీ అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఏ. లక్ష్మణ్ కుమార్ అన్నారు.
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేశారనీ, దేశ ప్రజల గుండెల్లో నిత్యం సంజీవుడుగానే రాజీవ్ గాంధీ ఉంటారని అన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని, దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరువలేనివని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు