J.SURENDER KUMAR,
శనివారం నుండి ప్రారంభం కానున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు.
శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆలయంలో లక్ష్మి నరసింహ స్వామి నీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు అధికారులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.