నేడు పుష్కర స్నానం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి!

👉 కాలేశ్వర క్షేత్రానికి సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కాలేశ్వరం క్షేత్రంలో సరస్వతీ నది పుష్కర స్నానం చేయనున్నారు . సీఎం రాక సందర్భంగా. దేవాదాయ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం బుధవారం నుంచి కాలేశ్వరంలో మాఖం వేసి ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు.   మంత్రి శ్రీధర్ బాబు అన్ని తానే అధికార యంత్రాంగానికి సూచనలు చేస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.


👉 ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ !


👉 ఉదయం 11 గంటలకు కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో  పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై అధికారులతో సమావేశం !


👉 సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్​ లో కాళేశ్వరం వద్ద  సరస్వతీ పుష్కర ఉత్సవాలకు బయల్దేరుతారు. !


👉 సాయంత్రం 5.20కి  పుష్కర ఘాట్​లో ఏర్పాటు చేసిన 17 అడుగుల శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. !


👉  అనంతరం త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తారు. !


👉 కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. !


👉 సాయంత్రం 6.40 కి ను సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం !


👉 7.30  పుష్కరాలకు విచ్చేసిన భక్తులను ఉద్దేశించి  ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.


👉 8 గంటలకు కాళేశ్వరం నుంచి సీఎం రేవంత్ రెడ్డి తిరుగుపయనం


👉
సరస్వతీ పుష్కర ఆరంభ దృశ్య మాలిక !