J.SURENDER KUMAR ,
ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ నృసింహ జయంతి ఉత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది.
తెల్లవారుజామున వేద పండితులు, అర్చకులు, చే శ్రీ స్వామివారికి పురుష సూక్త, శ్రీ సూక్త , కల్పోక్త న్యాసకపూర్వక షోడశ ఉపచార పూజ, సహస్రనామార్చన, పంచోపనిషత్తులతో మరియు మాన్యసూక్తంతో మరియు రుద్రాభిషేకం, పూజలు పంచోపనిషత్తులతో శ్రీ స్వామివారికి అభిషేకం, విశేష పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం సప్త హారతులు మరియు వేద మంత్రపుష్పములు, చతుర్వేద అవదార్యములు జరగనున్నాయి.
👉 సాయంత్రం 6 గంటలకు శ్రీస్వామి వారి స్తంబోధ్బవ సమయంలో స్వామివారికి విశేష పూజలు జరగనున్నాయి.