నేటి నుండి బుగ్గారం లో భూభారతి రెవెన్యూ సదస్సులు !

👉 పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గరాం మండలంలో రెవెన్యూ సదస్సులు !

👉 రెండు రెవెన్యూ బృందాల నియామకం వెరిఫికేషన్ బృందాలు !

👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ !

J.SURENDER KUMAR,

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన జగిత్యాల జిల్లాలోని బుగ్గరాం మండలంను ఎంపిక చేసినట్టు కలెక్టర్  సత్య ప్రసాద్ తెలిపారు సోమవారం నుండి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు.


👉 రెవిన్యూ సదస్సుల నిర్వహణ కోసం రెండు రెవెన్యూ బృందాలను నియమించామని అన్నారు.


👉 ఈ బృందాలు షెడ్యూల్ ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో ప్రతి రోజు అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు.

👉 ప్రతి రోజు ఒక్కో బృందం ఒక గ్రామం చొప్పున రోజుకు రెండు గ్రామాలలో సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు.

👉  ఈ రెవెన్యూ సదస్సుల్లో  భూ భూ సంబంధిత పేరు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వేనెంబర్ మిస్సింగ్, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, సరిహద్దు సమస్యలు,

👉 పార్ట్ -బి లో చేర్చిన భూముల సమస్యలు,  భూసేకరణ కేసులు, పట్టా లేకుండా ప్రభుత్వ భూములు కబ్జా కలిగిన వివరాలు సేకరణతదితర భూ సమస్యలను సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు

👉 రెవెన్యూ సదస్సుల్లో

ప్రభుత్వమే నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందని తెలిపారు.

👉 అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి సహకారం అందించేందుకు వీలుగా దరఖాస్తులను వెంటదివెంట పరిశీలన జరిపేలా వెరిఫికేషన్ బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.


👉 భూ సమస్యలు కలిగిన రైతులు, ప్రజలు ఈ సదస్సులను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.