108 సిబ్బంది సేవలు వెలకట్ట లేనివి !

👉 జిల్లా వైద్య అధికారి ప్రమోద్ కుమార్ !

J.SURENDER KUMAR,


జాతీయ పైలట్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని డిఎంఎచ్ఓ కార్యాలయంలో 108 జిల్లా మేనేజర్ రాము ఆధ్వర్యంలో పైలట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.


ముఖ్య అతిధిగా జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ పాల్గొని సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ పైలట్స్ డే పురస్కరించుకొని వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, అత్యవసర పరిస్థితిలో క్షతగాత్రులకు  ప్రాణదాతలు మీరే అని,108 సేవలు వేల కట్టలేనివి అని కొనియాడారు.

సిబ్బంది అంకిత భావంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండి క్షత గాత్రులకు సేవలు అందిస్తూ, గర్భిణీలకు డెలివరీ చేస్తూ ఆపత్కాలంలో ఆపద్బాంధవులుగా ఉండి ఆసుపత్రికి తరలించి సేవలు అందిస్తున్నారని అభినందించారు.


ఎల్లవేళలా 108 సిబ్బందికి తోడ్పాటు అందించడానికి సిద్ధంగా ఉన్నామని,మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎచ్ఓ డా.శ్రీనివాస్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.జైపాల్ రెడ్డి, జిల్లా ప్రోగ్రాం అధికారి డా.సమీయొద్దీన్, ఎన్ఎచ్ఏం జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్ మరియు,108 పైలట్స్,ఈఎంటీస్, జిల్లా వైద్యాధికారి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.