👉 అమాయక రైతుల సొమ్ముతో జల్సాలు – నీతి వాక్యాలు !
👉 ధర్మపురి విండో అక్రమాల పై చర్యలకు భయపడుతున్న అధికార యంత్రాంగం ?
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి సింగిల్ విండో పాలకవర్గ పొడగింపు పదవీకాలం మరో రెండు నెలలో ముగియనున్నది.
లక్షలాది రూపాయల సొసైటీ సొమ్ములతో కొనుగోలు చేసిన ఒక ఎకరం భూమిలో కేవలం 0 – 27 గుంటల భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యింది.

సొసైటీ కి రిజిస్ట్రేషన్ కావాల్సిన మరో 0 – 13 గుంటల భూమిని సొసైటీ పాలకవర్గం సంవత్సరాలు గడుస్తున్న రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు
.
వివరాలు ఇలా ఉన్నాయి..
👉 0-13 గుంటల భూమి ఏమైంది ?
ఐదు సంవత్సరాల క్రితం ధర్మపురి విండో అభివృద్ధి కోసం సర్వసభ్య సమావేశంలో తీర్మానం, పట్టేదారుతో కొనుగోలు ఒప్పంద, ప్రకారం, ధర్మపురి మండలం నాగారం గ్రామ శివారులో సర్వే నెంబర్ 84 ఈ లో ఒక ఎకరం భూమి కొనుగోలుకు తీర్మానించారు.
👉 భూమి కొనుగోలుకు జిల్లా సహకార సంఘం అధికారుల అనుమతి కి కోసం లేఖ రాశారు. ఎకరం భూమి కొనుగోలుకు ₹ 4.26 లక్షలతో కొనుగోలుకు అధికారులు జారీ చేసిన ఉత్తర్వులలో, ముగ్గురు కమిటీ సభ్యులను నియమించి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.
👉 భూ విక్రయ పట్టేదారుకు, లక్షలాది రూపాయల సొసైటీ సొమ్ము చెల్లించారు. ఒప్పందం మేరకు ఎకరం భూమి సొసైటీ కి రిజిస్ట్రేషన్ కావాల్సి ఉండగా కేవలం 0 – 27 , గుంటల భూమి, తేదీ 6-7-2020 న డాక్యుమెంట్ నెంబర్ 4052/2020 జగిత్యాల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సొసైటీ పేరున రిజిస్టర్ అయింది.

👉 0 -27 గుంటల భూమి…
భూ విక్రయించిన పట్టేదారు పేరున రెవెన్యూ రికార్డులో మరికొంత భూమి ఉంది. గత 5 సంవత్సరాలుగా ధర్మపురి సింగిల్ విండో పాలకవర్గం సొసైటీకి చెందాల్సిన 0-13 గుంటల భూమి రిజిస్టర్ చేయించుకోవడం లేదు.
👉 0 – 013 గుంటల భూమి ఎవరి పరం అయిందో ?
ఎవరి కబ్జాలో ఉందో ? పట్టేదారు ఎందుకు పట్టా చేయడం లేదో ? పాలకవర్గమే ప్రభుత్వానికి, రైతాంగానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది.
👉 2020 ఫిబ్రవరిలో పాలకవర్గం ఏర్పాటు !
ధర్మపురి సింగిల్ విండో పాలకవర్గం, 2020 ఫిబ్రవరి మాసంలో కొలువు దీరింది. పాలకవర్గ అధ్యక్షుడిగా ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి నీ పాలకవర్గం ఎన్నుకుంది.
👉 పదవి కాలం పొడగించిన ప్రభుత్వం !
ధర్మపురి విండో పాలకవర్గ పదవీకాలం 15-02-2025 నాటికి ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య Rt.No.74. Agri&Coop-(Coop-II) Dept. తేదీ 14-02-2025 ద్వారా మరో 6 నెలలు పాలకవర్గ పదవీకాలం పొడిగించింది. ఈ ఉత్తర్వులతో పాలకవర్గం 2025 ఆగస్టు మాసం వరకు కొనసాగుతారు.
👉 రైతుల సొమ్ములతో జల్సాలు..
అమాయక రైతుల సొమ్ముల తో జల్సాలు చేస్తూ నీతి వాక్యాలు వల్లించే పాలకవర్గం, సొసైటీకి చెందాల్సిన 0-13 గుంటల భూమి రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోవడం లేదో ? సొసైటీ పేరున ఉన్న భూమి లో కాస్తు చేస్తున్నది ఎవరో ? వారు కౌలు సొమ్ములు ఎవరికి చెల్లిస్తున్నా రో ? అనేది వేలాది మంది రైతాంగానికి అంతుపట్టని చిదంబర రహస్యం.
👉 ఆడిట్ అభ్యంతరపు నోటీసులు !

సహకార శాఖ పరమైన ఆడిట్ లో ధర్మపురి సొసైటీ నాగారంలో కొనుగోలు చేసిన భూమి గూర్చి అనేకసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పాలకవర్గాన్ని, అధికారులను వివరణ కోరుతూ నోటీసులు పంపిన, పాలకవర్గం స్పందించడం లేదు.
👉 కలెక్టర్ జోక్యం చేసుకుని..
కలెక్టర్ జోక్యం చేసుకోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో విచారణ జరిపి 0 -13 గుంటల భూమి ఎవరి కబ్జాలో ఉందో ? సొసైటీ పేరున రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదో ? ధర్మపురి విండో అక్రమాల పై చర్యలకు అధికార యంత్రాంగం ఎందుకు భయపడుతున్నదో ? సొసైటీకి చెందిన లక్షలాది రూపాయల నిధుల దుర్వినియోగం పై విచారణ జరగకుండా అడ్డుకుంటున్నది ఎవరో ? అనే చిదంబర రహస్యం చేదించాల్సిందిగా రైతాంగం కోరుతున్నారు.
👉 స్పందించని జిల్లా అధికారి !
ధర్మపురి సొసైటీ కి చెందాల్సిన 0-13 గుంటల భూమి సంవత్సరాలుగా రిజిస్టర్ కాకపోవడం పై వివరణకు జగిత్యాల జిల్లా సహకార శాఖ అధికారి మనోజ్ కుమార్ ను సోమవారం ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన స్పందించలేదు.
