J.SURENDER KUMAR,
కారుణ్య నియామకం కోసం గత 19 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఓ మహిళ కలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మోక్షం కలిగించారు. ఆమెకు హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆ కుటుంబంలో సంతోషం నింపారు.
👉 వివరాలు ఇలా ఉన్నాయి..
వరంగల్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి.భీమ్ సింగ్ సర్వీస్‌లో ఉండగా 24 సెప్టెంబర్ 1996లో ఎన్‌కౌంటర్‌లో మరణించారు. తండ్రి మరణం నేపథ్యంలో కారుణ్య నియామకం కోసం ఆయన కూతురు బి. రాజశ్రీ దరఖాస్తు చేసుకున్నారు. అయితే వివిధ సాంకేతిక కారణాలు చూపిస్తూ గత ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి. రాజశ్రీ అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఝప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
👉 రాజశ్రీ సమస్యను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన రేవంత్ రెడ్డి గారు నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని సీఎంఓ అధికారులకు సూచించారు. దాంతో హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజశ్రీ తన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే నాగరాజు తో వచ్చి ముఖ్యమంత్రి ని కలిసి ధన్యవాదాలు తెలిపారు.