పత్రికల పై దాడి.. ప్రజాస్వామ్యం పై దాడి !

👉 ఎడిటర్ ఇంటి పై ఏపీ పోలీసుల దాడి పై  జర్నలిస్టుల ఆందోళన !

J.SURENDER KUMAR,


పత్రికల పై దాడి, ప్రజాస్వామ్యం పై దాడి అని సీనియర్ జర్నలిస్టులు అన్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దాడిని నిరసిస్తూ గురువారం నాగర్ కర్నూల్ జిల్లా బస్టాండ్ సమీపంలో  అంబేద్కర్ కూడలి వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు.


ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కంది కొండ మోహన్, పరిపూర్ణం, అహ్మదుల్లా ఖాన్,శేఖరా చారి, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ పాదం వెంకటేష్, సిపిఎం నాయకులు పోదిల రామయ్య లు  మాట్లాడుతూ …


ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, ఆర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై కక్ష సాధింపుగా పోలీసులతో దాడి చేయించిందని వారు ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించే చర్యలకు పాల్పడితే జర్నలిస్టు కుటుంబం సహించే పరిస్థితి లేదని వారు హెచ్చరించారు. పత్రికలు ఏవైనా తాము జర్నలిస్టుగా ఇతర పత్రికలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను వ్యతిరేకిస్తాము అని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోవాలని రాజకీయ కక్షలకు పత్రికలను భాగస్వాములను చేయడం తగదని వారన్నారు.


  మరోమారు ఇలాంటి ఘటనలకు పాల్పడితే జర్నలిస్టు సంఘాలుగా ఉద్యమాలకు శ్రీకారం చుడుతామన్నారు.
మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వారన్నారు.


ఆందోళన కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రా నిక్  మీడియా జర్నలిస్టులు రాం లక్ష్మణ్, బాలస్వామి, రాజేష్ గౌడ్, దర్వేశ్, కొండకింది మాధవరెడ్డి, ఏటిగడ్డ వెంకటేష్, మల్లేష్, శ్రీనివాస్ గౌడ్, సత్యం, ప్రసాద్, వినయ్ గౌడ్, శ్రీశైలం, సైదులు, పరమేష్, శ్యామ్, దస్తగిరి, విజయ్, సాదిక్, సునిగిరి సురేష్,మహమూద్, టీ,ప్రదీప్ మహమ్మద్ రహీం, వెంకటేష్, టీవీ 5 సత్యం, రియాజ్, మహమ్మద్ సమీర్, విఠల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.