పాత్రికేయుడు  మునీర్ మృతి బాధాకరం సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


సీనియర్ పాత్రికేయుడు ఎండి మునీర్  మృతి పట్ల ముఖ్యమంత్రి  ఎ.రేవంత్ రెడ్డి  సంతాపం తెలియజేశారు. వృత్తి పట్ల నిబద్ధత, సామాజిక ఉద్యమాల పట్ల అంకితభావం కలిగిన మునీర్ మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

వివిధ పత్రికల్లో పనిచేసిన మునీర్  సింగరేణికి సంబంధించి ఎన్నో విషయాల్లో ప్రజలను చైతన్య పరిచారన్నారు. మనీర్  మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు అని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.