👉 ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి కోసం త్వరలో 30 కోట్లు మంజూరు చేస్తా..
👉 లక్ష్మణ్ కుమార్ లాంటి ఎమ్మెల్యే దొరకడం ధర్మపురి ప్రజల అదృష్టం..
👉 పంచాయతీ, రాజ్ స్త్రీ శిశు సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.!
J.SURENDER KUMAR
పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి సీతక్క పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణకుమార్ రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి ప్రారంభోత్సవం చేశారు.

అనంతర ఎల్లాపూర్ గ్రామంలోని ఎమ్మెస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మా ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటు లో ఉంటానని, వారి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వెనకబడిన ప్రాంతం అన్నిరంగాల్లో ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు కంకణం కట్టుకున్నామని చెప్పారు. ధర్మపురి నియోజక వర్గం అభివృద్ధి మరో ₹ 30 కోట్లు త్వరలో మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అదే విధంగా జగిత్యాలలో జెడ్పీ భవన నిర్మాణానికి, ఎంపీడీఓ భవన నిర్మాణానికి సైతం త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని వెల్లడించారు.
👉 లక్ష్మణ్ కుమార్ లాంటి ఎమ్మెల్యే దొరకడం ధర్మపురి ప్రజల అదృష్టం..

నిత్యం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు చుట్టూ తిరుగుతూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించుకుంటున్నారని మెచ్చుకున్నారు. లక్ష్మణ్ కుమార్ లాంటి ఎంఎల్ఏ దొరకడం ధర్మపురి నియోజక వర్గ ప్రజల అదృష్టమని మంత్రి సీతక్క అభినందించారు. వెనకబడిన ధర్మపురి అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల ఆదరణ, ఆప్యాయత జన్మలో మరువలేననీ సంతోషం వ్యక్తం చేశారు.
👉 ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణకుమార్ మాట్లాడుతూ

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి, ప్రజల ఆశీస్సులతో ఎంఎల్ఏగా ఎన్నిక అయ్యానని తెలిపారు. ధర్మపురి నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే అన్నిరంగాల్లో ముందుంచుతానని తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క వినతి పత్రం అందించారు. మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు
👉 పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ

ధర్మపురి ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
👉 రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ

ఎంఎల్ఏ అడ్లూరి లక్ష్మణకుమార్ ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
