ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు ను  ధర్మపురి ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్,  ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ను కలసి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ను ,  పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మపురి  శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కు రావాలని ఎమ్మెల్యే ఆహ్వానించి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనుల నిధులు, సాంకేతిక అనుమతుల, తదితర అంశాలపై  ఎమ్మెల్యే చర్చించారు
.