ప్రజా నాయకుడు స్వర్గీయ మాజీ మంత్రి రత్నాకర్ రావు !

👉 ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


స్వర్గీయ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు  ప్రజ నాయకుడని, పేద ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు,  పేదలకు అండగా వుండాలని నిరంతరం తపనపడే నాయకుడు,  ధర్మపురి ప్రాంతానికి తాగు సాగు నీటితో పాటు విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్  కుమార్ అన్నారు.

మాజీ మంత్రి స్వర్గీయ  జువ్వాడి రత్నాకర్ రావు  5 వ వర్ధంతి సందర్భంగా శనివారం ధర్మపురి తాసిల్దార్ స్థానిక  కార్యాలయం సమీపంలో గల రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మీడియాతో మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో రత్నాకర్ రావు  విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ గత పాలకులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. సంవత్సరం లోగా  రత్నాకర్ రావు విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో పట్టణం నడి బొడ్డున ఏర్పాటు చేస్తామన్నారు.

👉 తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని, పదేళ్లపాటు అధికారంలో వున్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేసిందని,  జగిత్యాల జిల్లాలోనే  45 వేల మందికి  రేషన్ కార్డుల పంపిణీ జరిగిందన్నారు.

👉 ఏడాదిన్నర కాలంలో ధర్మపురి నియోజకవర్గంలో రైతాంగానికి సాగునీటి సమస్యలను పరిష్కారంతోపాటు  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సంస్కృతాంధ్ర కళాశాల పున: ప్రారంభించామన్నారు.

👉 ధర్మపురి క్షేత్రాన్ని  యాదగిరి (యాదాద్రి) వలే తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.2027 లో జరుగనున్న గోదావరి పుష్కరాలను నభూతో:నభవిష్యత్ అనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహిస్తామనీ, ఇప్పటికే గోదావరి పుష్కరాల ప్రస్తావనను చట్ట సభలో ప్రస్తావించినట్టు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.