ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 లబ్ధిదారులకు సీఎం ఆర్ఎస్ ₹ 59 లక్షలు పంపిణీ  !


J.SURENDER KUMAR,


ప్రజా పాలన ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

నియోజకవర్గంలో ఆనా రోగ్య బారిన పడి వివిధ ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్న బాధితులకు స్థానిక ఎమ్మెల్యే
అడ్లూరి లక్ష్మణ్ కుమార్  198 మందికి ₹ 59 లక్షల 46 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయం అందించారు.


సోమవారం గొల్లపల్లి, ఎండపల్లి మండల కేంద్రంలో  లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.


గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక  మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి  సహాయ నిధి చెక్కులు ₹ 31 లక్షల  58 వేల 500/, 102 మంది  లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
i


👉ఎండపెల్లి మండల కేంద్రంలోని స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో  ముఖ్యమంత్రి సహాయ నిధి  ,₹ 27 లక్షల  87 వేల 500/-  96 మంది లబ్ధిదారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధిలు పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.