ప్రతి మండలలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


కార్మిక కర్షకుల ఆరోగ్య పరిరక్షణ కోసం నా నియోజకవర్గంలో నీ ప్రతి మండల కేంద్రంలో కార్మిక హెల్త్ క్యాంపులను నిర్వహిస్తానని ధర్మపురి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా  గురువారం ధర్మపురి  మున్సిపల్ ఆవరణలో   తెలంగాణ భవన, మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  హెల్త్ క్యాంప్ ఎమ్మెల్యే ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి  కార్మిక, కర్షకుడికి  మే డే శుభాకాంక్షలను ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి కార్మికుడు హెల్త్ క్యాంపును వినియోగించుకోవాలని, జిల్లా అధికారులతో చర్చించి ఇదే తరహాలో నియోజవర్గం లోని అన్ని మండలాల్లో కేంద్రాలలో హెల్త్ క్యాంప్  ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు, ఎమ్మెల్యే  తెలిపారు.