ప్రశాంత కేంద్రాలు గీతాశ్రమాలు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


నిత్య జీవన మనుగడలో మానసిక ప్రశాంతత చేకూరే ఆశ్రమాలు శ్రీ కృష్ణ గీతాశ్రమాలు అని, భక్తి ముక్తి తో పాటు సనాతన సాంప్రదాయాలు ఆచరణకు మార్గాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.


ధర్మపురి మండలం తీగలధర్మారం గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ కృష్ణగీతాశ్రమ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.


స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం బహుకరించి ఎమ్మెల్యేను సన్మానించారు.


ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.