ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి !

👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ !


J.SURENDER KUMAR,


ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని  హిందూ మత పెద్దలు ముస్లిం మత పెద్ద లతో పీస్ సమావేశంలో  జగిత్యాల జిల్లా  కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.


మంగళవారం జగిత్యాల జిల్లాలో బక్రీద్ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్  మరియు జిల్లా ఎస్పీ అశోక్  మరియు జిల్లా అధికారులు జిల్లా అధికారులు జగిత్యాల ఆర్డీవో  పాల్గొన్నారు .


👉 ఇందులో బక్రీద్ పండుగను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ Andhra Pradesh Slaughter act 1977 అనుసరించి ఎవరు కూడా ఆవులను మరియు లాగే దూడలను వధించకూడదని చెప్పడం జరిగింది. ఎవరైనా దీనిని అతిక్రమించినచో చట్టరీత్యా చర్యలు తీసుకోబడును  అని అన్నారు.


👉 Slaughter Houses దగ్గర సానిటేషన్ సరిగా చూడడానికి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు తగు చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది  మరియు జగిత్యాల జిల్లాలోని సరిహద్దులలో 8 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు


👉 ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ తహసిల్దార్లు , జిల్లా అధికారులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.