👉 భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దు !
J.SURENDER KUMAR,
కాలేశ్వర పుష్కర ఘాట్ లలో కాలినడకన కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం తిరుగుతూ భక్తుల సౌకర్యాల ఏర్పాట్ల పై ఆరా తీశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వద్దు అని అధికారులకు పలు సూచనలు చేశారు.

👉 పుష్కర ఘాట్ లలో స్టాళ్లు, టెంట్ సిటీ సరస్వతి ఘాట్ వద్ద భక్తులను పుష్కర ఏర్పాట్లు, సౌకర్యాలు, మరుగుదొడ్లు, షవర్స్, ఘాట్స్, చలి వేంద్రం పరిశీలించారు.

👉 ఈ సందర్భంగా స్టాళ్లు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీలు తయారు చేసిన హ్యాండ్ మేడ్ వస్తువుల స్టాల్ జైళ్ల శాఖ డిఐజి సౌమ్య మిశ్రాతో కలిసి ప్రారంభించారు.
👉 వివిధ స్టాళ్లు పరిశీలించి వ్యాపారాలు గురించి అడిగి తెలుసుకున్నారు. చలి వేంద్రాలలో మంచినీటి సరఫరాను పరిశీలించారు. త్రివేణి సంగమం వద్ద భక్తులకు మంచినీటి సరఫరాకు చలి వేంద్రం ఏర్పాటు చేయాలని తక్షణమే వాకిటాఖీ ద్వారా ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ఈ ని ఆదేశించారు.

👉 భక్తులతో మంచినీరు అందుతున్నదా ? మరుగుదొడ్లు, స్నానాల షవర్స్ ఎలా ఉన్నాయంటూ భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల అభిప్రాయాలను తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు.

👉 త్రివేణి సంగమంలో భక్తులు స్నానాలకు వెళ్ళడానికి వెళ్ళు మార్గంలో పిండ ప్రదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని దాని వల్ల భక్తులు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారని భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మార్గంలో ఎలాంటి పిండ ప్రదానం కార్యక్రమాలు నిర్వహించొద్దని సూచించారు.
👉 పిండ ప్రదానం కార్యక్రమాలు నిర్వాహణకు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే పిండ ప్రదానాలు నిర్వహించాలని సూచించారు. వ్యర్థాలు గ్రామ పంచాయతి ఏర్పాటు చేసిన డస్ట్ బిన్స్ లో వేయాలని, త్రివేణి సంగమంలో వేయొద్దని, భక్తులు నది పవిత్రను కాపాడాలని సూచించారు.
👉 అనతరం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాల్ లో భక్తులతో ఫోటో దిగారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పరిశ్రమల శాఖ జిఎం సిద్ధార్థ, డిఆర్డిఓ నరేష్, డిటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.