J.SURENDER KUMAR,
పుష్కర మహోత్సవాలను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు సమయానుకూలంగా పూర్తి చేయాలని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.

బుధవారం రాత్రి వరకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఆయన కాలేశ్వరంలో వివిఐపి ఘాట్, గోదావరి ఘాట్, 100 గదుల సత్రం మరియు వైద్యశాలను పరిశీలించి సమీక్షించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ….

గోదావరిలో వ్యర్దాలు తొలగించి పరిశుభ్రం చేయాలని సూచించారు. సమయం చాలా తక్కువగా ఉందని, ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు పనులు జరగలేదని అధికారులు గుర్తించి నిర్దిష్ట కార్యాచరణతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సదుపాయాలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున, అన్ని విభాగాలు అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

పనులు వేగవంతం చేసేందుకు కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు.
ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనుపు కలెక్టర్ విజయలక్ష్మి, పంచాయతి రాజ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, వైద్య, దేవాదాయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.