👉 ప్రత్యేక పూజలతో ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు !
👉 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాక !
👉 ప్రత్యేక పూజలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు దంపతులు !
J.SURENDER KUMAR
కాలేశ్వరం క్షేత్రంలో సరస్వతి నది పుష్కరాలు నేటి తెల్లవారుజామున వేదమంత్రాల పఠనం ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
మంత్రి శ్రీధర్ బాబు ఆయన సతీమణి దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామ శైలజ అయ్యంగార్,
కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్నానం చేశారు.

వీరితోపాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యుల గండ్ర సత్యనారాయణ రావు. హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద. పాల్గొన్నారు.

తెల్లవారుజామున 5.45 నిమిషాలకు మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర స్నానం ప్రారంభం అయ్యాయి.
కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో సరస్వతి పుష్కరాలు ప్రారంభం

మంత్రి శ్రీధర్ బాబు దంపతులు సరస్వతీ నదికి ప్రత్యేక పూజలు చేశారు.
స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ బహుళ తదియ గురువారం ఉ॥ 5:44 నిమిషాలకు వృషభ లగ్నంలో మిథున రాశిలో బృహస్పతి ప్రవేశం జరుగుతుందని వేద పండితులు నిర్ధారించారు

👉 సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు !

సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో సాయంత్రం 5.00 కాళేశ్వరం చేరుకొని టెన్త్ సిటీ వీఐపీ గదిలో ఉంటారు
👉 ఐదు గంటల 35 నిమిషాలకు శ్రీ సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు !
👉 6 గంటలకు సీఎం పుష్కర స్నానం చేస్తారు !
గంటల మధ్య శ్రీ కాళేశ్వర్ స్వామినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు !
👉 సరస్వతి నదికి జరగనున్న సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం లో సీఎం పాల్గొంటారు
👉 రాత్రి 8 గంటల ప్రాంతంలో భక్తులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.