J. SURENDER KUMAR,
సరస్వతీ పుష్కరాల సందర్భంగా ప్రముఖ త్రిలింగ కాలేశ్వర క్షేత్రానికి ప్రసిద్ధ పుష్ప గిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సభినవోద్దండ విద్యాశంకర భారతీ మహస్వామి వారు ఆదివారం పుష్కర స్నానం ఆచరించారు.

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని పీఠాధిపతి దర్శించుకుని భక్తులకు ఆశీర్వచనం అందచేశారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆర్జేసి రామ కృష్ణారావు, ఈ ఓ మహేష్, ఆలయ చైర్మన్ మోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
👉 హైకోర్టు న్యాయమూర్తి రాక !

సరస్వతి పుష్కరాల లో స్నానం ఆచరించడానికి ఆదివారం కాలేశ్వరం క్షేత్రానికి హై కోర్టు న్యాయమూర్తి సుధా వచ్చారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, న్యాయమూర్తికి స్వాగతం పలికారు.
👉శ్రీ భాగవత భక్తి రసం ఆధ్యాత్మిక ప్రవచనం ప్రారంభం !
శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో పుష్కరాల సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నుండి మూడు రోజుల పాటు ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, టీవీ జ్యోతిష్య శాస్త్ర, ఆధ్యాత్మిక పండితులు పాలేపు చంద్రశేఖర శర్మ ప్రవచనాలు ప్రారంభమయ్యాయి.

“భాగవత భక్తి రసం” అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ, భక్తి మార్గం, ధర్మం, నైతిక విలువల ప్రాధాన్యతలపై శ్రద్ధాజనులకు లోతైన సందేశాలు అందించారు. దేవస్థాన ప్రాంగణంలో భారీ సంఖ్యలో భక్తులు ఆలకించారు.
ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు ఈ ప్రవచనాలు ప్రతిరోజూ సాయంత్రం నిర్వహించబడతాయని అధికారులు వివరించారు.
👉నృత్య సంగీత విభావరి దృశ్యమాలిక !


