J.SURENDER KUMAR,
భూపాలపల్లి తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆహ్వానం మేరకు కాలేశ్వరం సర్వస్వతీ పుష్కరాలకు ఆదివారం విచ్చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుష్కర స్నానం చేశారు.
కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు పరమశివునికి అభిషేకం చేశారు
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ …
ప్రజలంతా ఆ దేవదేవుని దర్శించుకుని తరించాలని పాడిపంటలు బాగా పండాలని రైతులు అందరు సంతోషంగా ఆ భగవంతుని కోరుకున్నా రు వచ్చిన ప్రతిభను జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని కోరారు.
కాలేశ్వరం ఆలయం గురించి అందరూ తెలుసుకోవాలని దేశంలోని ఈ యొక్క గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్నతో పాటు తెలంగాణ బీసీ సంఘం చైర్మన్ హరి శంకర్ గౌడ్ కోఆర్డినేటర్ మరియు భూపాలపల్లి తీన్మార్ మండలం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ భూపాలపల్లి టీం సభ్యులు పాల్గొన్నారు
👉 ప్రజావాణి కార్యక్రమం రద్దు !
జిల్లా యంత్రాంగం కాళేశ్వరం లో జరుగుతున్న సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణలో ఉన్నందున 19వ తేదీ సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.