పుష్కర విధులు కేటాయయించిన వారు అప్రమత్తంగా ఉండాలి!

👉 కలెక్టర్ రాహుల్ శర్మ !


J.SURENDER KUMAR,


సరస్వతి పుష్కర విధులు కేటాయయించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ 12 రోజులు  అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.


బుధవారం కాలేశ్వరం దేవస్థానంలోని కళ్యాణ మండపంలో విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి కేటాయించిన విధుల పట్ల దిశానిర్దేశం చేశారు. 

👉 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ

మన జిల్లాలో పెద్ద ఎత్తున సరస్వతి పుష్కరాలు జరుపుతున్నామని, అందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  ప్రతిరోజు లక్షకిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికార యంత్రం ఆసాంతం అప్రమత్తంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

👉 ప్రతి అధికారికి కేటాయించిన లొకేషన్స్ లో ముందస్తుగా పర్యటించి ఏర్పాట్లు పరిశీలన చేయాలని తెలిపారు.  గైర్హాజరైన అధికారులకు,  సిబ్బందికి ఆయా శాఖలకు తగు చర్యలు నిమిత్తం సిఫారసు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

👉 15వ తేదీ ఉదయం పుష్కరాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ  మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు పుష్కరాలను ప్రారంభించనున్నారని తెలిపారు.

👉 15వ  తేదీ సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి  సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరణ,  పుష్కర స్నానం తదుపరి స్వామి వారి దర్శనం, గోదావరి హారతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారని  అనంతరం టెంట్ సిటీ పరిశీలిస్తారని తెలిపారు.

👉 కాశీ పండితులతో ప్రత్యేకంగా  హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని అన్నారు. కుంభమేళా వెళ్లలేని వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఆ ప్రకారం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. 

👉 ఈ 12 రోజుల విధులు  చాలా ముఖ్యమని ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు.  సరస్వతి ఘాట్ మెయిన్ ఘాట్ వద్ద భక్తులు పుష్కర స్నానాలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. 


👉 భక్తులకు స్నానాల షవర్లు,  బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  పిండ ప్రధాన కార్యక్రమాలు  చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

👉 స్టాళ్లు, టెంట్ సిటీ,   డార్మెటరీ,  ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారులు తు.చ తప్పక విఐపి ప్రోటోకాల్ పాటించాలని సూచించారు.  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని కంట్రోల్ రూమ్ కి వచ్చిన సమస్యను తక్షణమే ఆయా శాఖల అధికారులు దృష్టి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

👉 దేవాలయంలో భక్తులు క్యూలైన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  50 మంది గజ ఈతగాళ్ళు నాటు పడవలతో  పహారా కాస్తున్నట్లు తెలిపారు. విధులు నిర్వహించే అధికారులు సిబ్బందిని పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

👉  తాత్కాలిక బస్టాండ్ నుంచి ఘాట్స్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచితంగా 30 షటిల్ బస్సులు నడుపుతున్నామని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

👉 పుష్కరవిధులు కేటాయించిన అధికారులకు రెండు షిప్టుల్లో  విధులు కేటాయించామని అప్రమత్తంగా ఉండాలని,  సమయానికి విధులకు హాజరు కావాలని తెలిపారు. ఎవరైనా గైర్హాజరు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

👉 విధులు కేటాయించిన సిబ్బందికి భోజన,  వసతి ఏర్పాటు చేస్తున్నామని సమయ పాలన పాటించాలని సూచించారు. స్విమ్మర్లు లైఫ్ బాయ్స్,  జాకెట్స్ ధరించాలని గోదావరిలో ఏ ఒక్కరు మిస్ అయిన విధులకు ఇబ్బంది కలుగుతుందని అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

👉 ఈ సమావేశంలో దేవాదాయశాఖ డైరెక్టర్ వెంకటరావు,  అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,  ఆర్డిఓ  రవి అన్ని శాఖల జిల్లా అధికారులు,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు