పుష్కరాల సక్సెస్ కు యంత్రాంగంలో సమన్వయం కావాలి !

👉 ముందస్తుగా భక్తుల రాకను అంచనా వేయాలి !

J. SURENDER KUMAR,


ప్రముఖ త్రిలింగ పుణ్యక్షేత్రమైన కాలేశ్వర గోదావరి నది తీరంలో  ఈ నెల15 న ఆరంభమై 26 తో ముగియనున్న సరస్వతీ  పుష్కరాల ( విజయవంతం కావడానికి ) సక్సెస్ కు 12 రోజులపాటు అధికార యంత్రాంగంలో సమన్వయం ప్రధానం.


👉 గతంలో గోదావరి నది పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతర ఉత్సవాలలో విధులు నిర్వహించి  అనుభవమున్న అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ముందస్తుగా  వారి సూచనలు పరిగణంలోకి తీసుకోవాలి !


👉 రాష్ట్రం లో పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి ప్రైవేట్ , సొంత, ఆర్టీసీ ఇతర వాహనాలు, రైలు మార్గం ద్వారా 12 రోజులపాటు రానున్న భక్తుల సంఖ్యను ముందస్తుగా ఆయా ప్రాంతాల్లో అంచనా వేయడానికి ఆయా ప్రాంతాల అధికార  యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాలి !


👉 వాహనాల ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రధాన పట్టణాల నుండి కాలేశ్వరం క్షేత్రానికి వచ్చే ప్రధాన రహదారులలో  30  కిలోమీటర్లు దూరంలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి. కాలేశ్వరంలో ఉన్న భక్తుల, వాహనాలు రద్దీని అంచనా వేసి రాకపోకలకు అనుమతించాలి !


👉 వాహనాల పార్కింగ్ స్థలాలలో మొబైల్ టాయిలెట్ వాహనాలు, మదర్ ఫీడింగ్ కేంద్రాలు, నిరంతర విద్యుత్తు సరఫరా ఉండాలి !


👉 పుష్కర ఘాట్లకు కాలినడకన ఇబ్బంది పడే భక్తులను తరలించడానికి ద్విచక్ర వాహన రైడర్స్ ను అందుబాటులో ఉంచాలి ( కుంభమేళా తరహాలో యువతకు ఉపాధి, వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి )


👉 అగ్ని ప్రమాదాలు నియంత్రణకు ఫైర్ సిబ్బంది కొన్ని ద్విచక్ర వాహనాల తో కార్బన్డయాక్సైడ్ సిలిండర్లు పుష్కర ఘాట్లు, హోటల్స్ పరిసరాలు అందుబాటులో ఉంచాలి  ( కుంభమేళాలో అమలు పరచిన మొబైల్ ఫైర్ సేఫ్టీ సిస్టం )


👉 రహదారులలో, పార్కింగ్ స్థలాలలో, వాహనాలు  ఇరుక్కొని రోడ్డు జామ్ అయిన సందర్భంలో మొబైల్ వెహికిల్ క్రేన్లు అందుబాటులో ఉంచాలి !


👉 సెల్ ఫోన్ సిగ్నల్స్ జామ్ కాకుండా కాలేశ్వరం, పుష్కర ఘాట్ల, పరిసర ప్రాంతాల్లో వివిధ  ఫోన్ కంపెనీలు. తమ టవర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీని  పెంచేలా ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేయాలి !


👉 పుష్కర ఘాట్ల పరిసర ప్రాంతాలలో సంచార పారామెడికల్ నిపుణులు, సిబ్బంది, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలి !


👉 కల్తీ నిరోధక , అధికారులు, సిబ్బందితో ముందస్తుగా  హోటల్స్ తినుబండారాల ను పరిశీలించాలి  ( ఫుడ్ పాయిజన్ జరగకుండా )


👉 విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వాహకులతో అధికార యంత్రంగా ముందస్తుగా  సంప్రదించి వారి  సహకారం కోరాలి ( వారికి డ్రెస్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి )


👉 పుష్కర ప్రాంతంలో విధులు నిర్వహించే అధికార యంత్రాంగం ( పోలీసులు, దేవాదాయ శాఖ, శానిటేషన్ మెడికల్, ఫైర్  విద్యుత్తు స్వచ్ఛంద సేవకులు) డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలి .


👉 వాహనాలను మెటల్ డిటెక్టర్ తో తనిఖీల అనంతరమే పార్కింగ్ స్థలాలలోకి అనుమతించాలి,  శుద్ధ జల మొబైల్ వాహనాలు అందుబాటులో ఉండాలి !


👉 గోదావరి, పిండ ప్రధాన సంకల్ప పురోహితులకు , అక్కడ వ్యాపార నిర్వహకులకు అధికారులు గుర్తింపు కార్డులు జారీ చేయాలి !


👉 ఆయా పుష్కర సెక్టర్లలో విధులు నిర్వహించే పోలీస్ యంత్రాంగం భక్తులతో స్నేహపూర్వకంగా ప్రవర్తించాలి !


👉 పుష్కర ఘాట్లు, ప్రాంగణలలో అధికారిక డ్రోన్ కెమెరాలు మినహా,  ఇతర ప్రైవేట్  డ్రోన్ కెమెరాలను  నిషేదించాలి !


👉 మహిళలు దుస్తులు మార్చుకునే ప్రదేశాల్లో మహిళా పోలీసులను  నియమించాలి !


👉 పుష్కర ఘాట్ల లో వివిధ ప్రాంతాలలో ఉచిత అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయాలి !


👉 పుష్కర సమాచార కేంద్రాలను  కాలేశ్వరం తో పాటు ఇతర పట్టణాలలోని బస్ స్టేషన్లలో రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయాలి వాటి ఫోన్ నెంబర్లు ముందస్తుగా  ( డిస్ ప్లే ) చేయాలి !


👉 వివిధ రాజకీయ పార్టీల నాయకులకు తో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలి !


👉 24/7  పారిశుద్ధ్యము, పోలీస్ నిఘా, పోలీస్ డాగ్స్ మెటల్ డిక్టేటర్లతో పుష్కర ఘాట్ ప్రాంతాల్లో సంచరించాలి , ద్విచక్ర వాహనాలతో కాలేశ్వరంకు వచ్చే రోడ్ల పై నిరంతర గస్తీ నిర్వహించాలి !


👉 ప్రతిరోజు సమయానుకూలం అధికార యంత్రాంగం ఏర్పాట్ల లోటుపాట్లపై సమీక్షలు నిర్వహించుకోవాలి !


👉 స్వామీజీలు, పీఠాధిపతుల రాక సందర్భంగా వారికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతించడానికి ప్రణాళిక  (రూట్ మ్యాప్) సిద్ధం చేసుకోవాలి !


👉 సమాచార, పౌర సంబంధాల యంత్రాంగం ప్రతి మూడు గంటలకు మీడియాకు ఫోటోలు, వార్తలు మీడియా సెంటర్ లలో అందుబాటులో ఉంచాలి !


👉 అంబులెన్స్ వాహనాల రాకపోకలకు అనుకూలంగా ప్రత్యేక  రహదారులను ముందస్తు గా  అధికారులు గుర్తించాలి !


👉 పుష్కర ఘాట్లు,  సెక్టర్లు , ట్రాఫిక్ నియంత్రణ, దేవాలయ ప్రాంగణం, నదిలో గజ ఈతగాళ్ళ ఏర్పాటు, తదితర కీలక ప్రాంతాలలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, అధికారులకు, నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి !


👉 (  జమ్ము కాశ్మీర్ లో పహల్గాం , పాకిస్తాన్ – భారత్ ల యుద్ధ వాతావరణం, తదితర సంఘటనల నేపథ్యంలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత నెలకొంది. దీనికి తోడు పుష్కరాల ప్రారంభానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, రానున్న నేపథ్యంలో పుష్కరాల నిర్వహణ అధికార యంత్రాంగానికి  అగ్నిపరీక్ష )


👉 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పుష్కరాల నిర్వహణకు కట్టుబడి ఉండగా.. ఏదైనా చిన్న పొరపాటు, అపశృతి జరిగిన ఆ అవకాశం ఆసరాగా చేసుకొని ఆరోపణలకు. విమర్శలకు ఓ పక్షం ఎదురుచూస్తున్న సందర్భంగా ఈ ఉపోద్ఘాతం


👉 గోదావరి పుష్కరాల రిపోర్టింగ్ అనుభవ నేపథ్యంలో.…..