👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాల కల్పన కోసం మా ప్రభుత్వం అమలు చేయనున్న రాజీవ్ యువ వికాసం పథకం పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయవద్దని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
యువతకు స్వయం ఉపాధి కోసం ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం లబ్ధిదారుల ఎంపిక సిబిల్ స్కోర్ ఆధారంగా జరుగుతుందని చేస్తున్న ప్రచారం అవాస్తవం అని అన్నారు. నిరుద్యోగులకు పాలిటవరం రాజీవ్ యువ వికాసం పథకం అని అన్నారు.
ప్రతిపక్షాలు రాజకీయాల కోసం యువత జీవితాలతో ఆడుకోవద్దు , అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా త్వరితగతిన జరుగుతుందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి నియోజకవర్గాల వారిగా మంజూరు లేఖలు పంపిణీ చేస్తామని, అభ్యర్థులు ధైర్యంగా ఉండాలి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని నిరుద్యోగ యువత కు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జారీ చేసిన ప్రకటన ఎమ్మెల్యే విడుదల చేశారు.